Share News

సుప్రీంకోర్టులో టీఎంసీకి ఎదురుదెబ్బ..

ABN , Publish Date - May 02 , 2026 | 11:17 AM

సుప్రీంకోర్టులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై టీఎంసీ నేతలు నమ్మకం ఉంచాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

సుప్రీంకోర్టులో టీఎంసీకి ఎదురుదెబ్బ..
TMC Supreme Court case

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై టీఎంసీ నేతలు నమ్మకం ఉంచాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో పర్యవేక్షకులుగా కేవలం కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల (PSU) ఉద్యోగులను మాత్రమే ఎలక్షన్ కమిషన్ నియమించడాన్ని సవాలు చేస్తూ టీఎంసీ వేసిన పిటిషన్‌ను కోల్‌కతా హైకోర్టు కొట్టివేసింది. కోల్‌కతా హైకోర్టు తీర్పును టీఎంసీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది (TMC Supreme Court case).


టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ పి.ఎస్. నరసింహ, జయమాల్య బాగ్చీలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం తాజాగా విచారించింది (Trinamool Congress setback). కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా తమకు వ్యతిరేకంగా వెళ్తారనే టీఎంసీ వాదన సరికాదని ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులపై విశ్వాసం ఉంచాలని సూచించింది. పర్యవేక్షకులుగా కేవలం కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను మాత్రమే నియమిస్తూ ఈసీ జారీ చేసిన సర్క్యులర్ నిబంధనలకు విరుద్ధంగా లేదని పేర్కొంది.


ఒట్ల లెక్కింపు సమయంలో అక్కడ టీఎంసీ ప్రతినిధులు కూడా ఉంటారని వివరించింది. ఓట్ల లెక్కింపు సిబ్బందిని కేవలం ఒకే వర్గం నుంచి ఎంచుకునే వెసులుబాటు ఎలక్షన్ కమిషన్‌కు ఉందని పేర్కొంది. టీఎంసీ పిటిషన్‌పై తదుపరి ఆదేశాలు అవసరం లేదని పేర్కొంది. ఏప్రిల్ 13 నాటి ఆ సర్క్యులరే అమలవుతుందని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి..

ఒప్పందం కుదరకపోతే ఇతర మార్గాలు.. ఇరాన్‌ను హెచ్చరించిన ట్రంప్..


బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - May 02 , 2026 | 11:43 AM