Share News

ఒప్పందం కుదరకపోతే ఇతర మార్గాలు.. ఇరాన్‌ను హెచ్చరించిన ట్రంప్..

ABN , Publish Date - May 02 , 2026 | 08:13 AM

పశ్చిమాసియాలో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ శాంతి చర్చల విషయంలో మాత్రం పూర్తి స్పష్టత రావడం లేదు. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఒప్పందం విషయంలో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఒప్పందం కుదరకపోతే ఇతర మార్గాలు.. ఇరాన్‌ను హెచ్చరించిన ట్రంప్..
Donald Trump

పశ్చిమాసియాలో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ శాంతి చర్చల విషయంలో మాత్రం పూర్తి స్పష్టత రావడం లేదు. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఒప్పందం విషయంలో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పాకిస్థాన్ ద్వారా ఇరాన్ పంపించిన ప్రతిపాదన తనకు నచ్చలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌పై సైనిక చర్యకు దిగే అవకాశం ఉందని హెచ్చరించారు (Trump Iran proposal).


'ఇరాన్ ప్రతిపాదన అంగీకరించదగిన స్థాయిలో లేదు. ఒప్పందం సాధ్యమవుతుందో లేదో చెప్పడం కష్టం' అని ట్రంప్ తాజాగా పేర్కొన్నారు. దీంతో ఇరాన్-అమెరికా మధ్య చర్చలు ఇంకా అనిశ్చితిలోనే ఉన్నట్టు అర్థమవుతోంది. తమ దేశంపై ఆర్థిక ఆంక్షలు ఎత్తెయ్యాలని, నౌకా దిగ్బంధనం తొలగించాలని ఇరాన్ అడుగుతోంది. అలాగే అణు కార్యక్రమం గురించి ఇప్పటికప్పుడు ఒక ఒప్పందానికి రాకూడదని భావిస్తోంది. అయితే అమెరికా మాత్రం తమ డిమాండ్లను నెరవేరిస్తేనే చర్చలపై ముందుకు వెళ్లాలని అనుకుంటోంది (US Iran war update 2026).


అణు కార్యక్రమం విషయంలో పూర్లి క్లారిటీ కావాలని, అలాగే హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని (Strait of Hormuz crisis), అప్పటివరకు నౌకా దిగ్బంధన కొనసాగుతుందని అమెరికా స్పష్టం చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య చర్చలు అనిశ్చితిలో పడ్డాయి. 'ఒప్పందం కుదరకపోతే ఇతర మార్గాలను కూడా పరిశీలించాల్సి వస్తుంది' అని ట్రంప్ తాజాగా హెచ్చరించారు. సైనిక చర్యలకు దిగే అవకాశాలున్నాయని సంకేతాలు ఇచ్చారు.


ఇవి కూడా చదవండి..

మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు

భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌‌ను తోసిపుచ్చిన ఈసీ

Updated Date - May 02 , 2026 | 08:20 AM