Share News

మృతదేహం కూడా లైన్‌లోనే.. యూపీలో పెట్రోల్ బంక్ వద్ద అమానుష ఘటన..

ABN , Publish Date - May 02 , 2026 | 10:22 AM

మృతదేహం లైన్‌లో ఉండడమేంటని ఆశ్చర్యపోతున్నారా? ఉత్తరప్రదేశ్‌లో తాజాగా జరిగిన ఈ అమానుష ఘటన తీవ్ర ఆగ్రహానికి గురవుతోంది. ఇరాన్ యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన కొరత చనిపోయిన వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా పక్కకు నెట్టింది.

మృతదేహం కూడా లైన్‌లోనే.. యూపీలో పెట్రోల్ బంక్ వద్ద అమానుష ఘటన..
UP petrol pump incident

ఇరాన్ యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన కొరత చనిపోయిన వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా పక్కకు నెట్టింది. ఉత్తరప్రదేశ్‌లో తాజాగా జరిగిన ఈ అమానుష ఘటన తీవ్ర ఆగ్రహానికి గురవుతోంది. ఒక మృతదేహాన్ని తీసుకెళ్తున్న వాహనం పెట్రోల్ బంక్ వద్ద గంటల తరబడి లైన్‌లో ఉండాల్సి వచ్చింది. అయినా డీజిల్ దొరకలేదు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి (UP petrol pump incident).


ఈ ఘటన యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. నిచ్లౌన్ ప్రాంతానికి చెందిన సర్వేష్ కసౌధన్ అనే వ్యక్తి మరణించాడు. కుటుంబ సభ్యులు అతడి మృతదేహాన్ని అంతిమ సంస్కారాల కోసం వాహనంలో తరలించే ఏర్పాట్లు చేశారు. అయితే డీజిల్ అయిపోవడంతో, నిచ్లౌల్ రోడ్డులో ఉన్న ఒక పెట్రోల్ బంక్ వద్ద ఆ వాహనం ఆగాల్సి వచ్చింది. వాహనం అక్కడ దాదాపు రెండు గంటల పాటు లైన్‌లో ఉండిపోయింది. అయినప్పటికీ ఆ వాహనానికి డీజిల్ దొరకలేదు. స్టాక్ అయిపోయిందని చెప్పి సిబ్బంది బంక్‌ను మూసివేశారు (Dead body in queue India).


పెట్రోల్ బంక్ ముందు రెండు గంటల పాటు మృతదేహం వాహనంలోనే ఉండిపోవడం అక్కడున్న ప్రజలను కలచివేసింది (Fuel shortage Uttar Pradesh). ఈ ఘటనను అక్కడున్న వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. వీడియోలో ఒక వ్యక్తి.. 'పరిస్థితి ఎంత దిగజారింది. చనిపోయినవాళ్లు కూడా లైన్‌లో నిలబడాల్సి వస్తోంది' అని వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. కాగా, ఈ ఘటనపై స్థానిక అధికారులు స్పందించారు. పెట్రోల్ బంక్ యజమానికి నోటీసులు ఇస్తామని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

ఒప్పందం కుదరకపోతే ఇతర మార్గాలు.. ఇరాన్‌ను హెచ్చరించిన ట్రంప్..


బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - May 02 , 2026 | 10:24 AM