పశ్చిమాసియా, ఐరోపా ముక్కలు కాకుండా కాపాడాం: అమెరికా అధ్యక్షుడు
ABN , Publish Date - May 02 , 2026 | 09:42 AM
ఇరాన్‌తో చేస్తున్న యుద్ధాన్ని విమర్శిస్తున్న వారిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధాన్ని మరోసారి సమర్థించుకున్నారు. ఇరాన్‌తో యుద్ధంపై విమర్శలు చేస్తున్నవారిని ట్రంప్ 'దేశద్రోహులు'గా అభివర్ణించారు.
ఇరాన్‌తో చేస్తున్న యుద్ధాన్ని విమర్శిస్తున్న వారిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధాన్ని మరోసారి సమర్థించుకున్నారు. ఇరాన్ అణ్వాయుధాలు సమకూర్చుకుంటే.. అది కేవలం ఒక దేశానికి మాత్రమే కాకుండా ప్రపంచ భద్రతకు పెద్ద ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. ఇరాన్ అలా చేయకుండా అమెరికా అడ్డుకుందన్నారు (Donald Trump Iran news).
'బీ2 బాంబర్లతో ఇరాన్‌పై దాడులు చేసి అది అణ్వాయుధం తయారు చేయకుండా అడ్డుకున్నాం. ఒకవేళ మేం అలా చేయకపోయి ఉంటే ఇజ్రాయెల్, పశ్చిమాసియాతో పాటు ఐరోపా కూడా ముక్కలైపోయేవి. ఇది కేవలం యుద్ధం కోసం చేస్తున్న యుద్ధం కాదు. ఇది ప్రపంచాన్ని కాపాడటానికి తీసుకున్న చర్య. ఇరాన్‌లోకి ప్రవేశించి అక్కడ అణ్వాయుధం లేదని నిర్ధారించుకోవాలి' అని ట్రంప్ పేర్కొన్నారు (Iran nuclear programme).
ఇరాన్ యుద్ధంపై విమర్శలు చేస్తున్నవారిని ట్రంప్ 'దేశద్రోహులు'గా అభివర్ణించారు (Europe threat Iran). తమ చర్యలను విమర్శించే వారు పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తమ సైనిక చర్యతో ఇరాన్ పూర్తిగా నాశనమైందని అన్నారు. ఇరాన్ సైనిక సామర్థ్యం గణనీయంగా తగ్గిందని, వారి వైమానిక, నావికా దళాలు పూర్తిగా తుడిచిపెట్టుకు పోయాయని అన్నారు.
ఇవి కూడా చదవండి..
ఒప్పందం కుదరకపోతే ఇతర మార్గాలు.. ఇరాన్‌ను హెచ్చరించిన ట్రంప్..
బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..