హోర్ముజ్ జలసంధిపై కొత్త నిబంధనలు.. ఐఆర్‌జీసీ కీలక ప్రకటన..
ABN , Publish Date - May 02 , 2026 | 08:39 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఇస్లామిక్ రివెల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) కీలక ప్రకటన చేసింది. చమురు సరఫరాలో కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిపై కొత్త సముద్ర నియమాలు అమలు చేయనున్నట్లు వెల్లడించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఇస్లామిక్ రివెల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) కీలక ప్రకటన చేసింది (Iran IRGC). చమురు సరఫరాలో కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిపై కొత్త సముద్ర నియమాలు అమలు చేయనున్నట్లు వెల్లడించింది. అరేబియా గల్ఫ్, హోర్ముజ్ జలసంధి మార్గాలపై తమ నియంత్రణను బలోపేతం చేసే ఉద్దేశంతో ఐఆర్‌జీసీ కొత్త నిబంధనలను అమలు చేయనున్నట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది (Strait of Hormuz news).
అరేబియా గల్ఫ్, హోర్ముజ్ జలసంధి మీదుగా విస్తరించి ఉన్న దాదాపు 2 వేల కిలోమీటర్ల ఇరాన్ తీర ప్రాంతంపై తమ పర్యవేక్షణ ఉంటుందని ఐఆర్‌జీసీ నావికా దళ కమాండర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ మార్గంలో రవాణాపై త్వరలోనే కొత్త నిబంధనలను అమలు చేస్తామని తెలిపారు. తమ చర్యలు ఇరాన్ ప్రజలకు గర్వకారణంగా ఉంటాయన్నారు. సముద్ర భద్రతను బలోపేతం చేయడం, విదేశీ జోక్యాన్ని తగ్గించడం, ప్రాంతీయ నియంత్రణను పెంచడం, వాణిజ్య మార్గాలను తమ ఆధీనంలో ఉంచడమే ఆ నిబంధనల లక్ష్యాలని తెలిపారు (Iran maritime rules).
హోర్ముజ్ జలాలు భద్రత, అభివృద్ధికి మూలంగా మారాలని తాము కోరుకుంటున్నట్టు ఐఆర్‌జీసీ పేర్కొంది (US Iran tensions). కాగా, 'పర్షియన్ గల్ఫ్ కేవలం నీలి జలాల కేంద్రం మాత్రమే కాదు. అది మన గుర్తింపు. మన నాగరికతలో ఒక భాగం. ప్రపంచ దేశాల మధ్య అనుసంధాన కేంద్రం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలక మార్గం' అని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఓ ప్రకటన విడుదల చేశారు. పర్షియన్ గల్ఫ్‌ను లక్ష్యంగా చేసుకుని కుట్రలు పన్నుతున్న విదేశీ బలగాలకు ఆ జలాల అడుగున తప్ప మరెక్కడా స్థానం ఉండదని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
ఒప్పందం కుదరకపోతే ఇతర మార్గాలు.. ఇరాన్‌ను హెచ్చరించిన ట్రంప్..
బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..