కాస్త పట్టించుకోండి బాస్..
ABN , Publish Date - May 02 , 2026 | 10:14 AM
పల్నాడు జిల్లాలో ఇప్పటికే పోలీసు అధికారులు, సిబ్బంది అసాంఘిక కార్యకలాపాలు అనేకం వెలుగు చూశాయి. పోలీసులే మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
పోలీసుశాఖపై కొరవడిన నిఘా
పట్టుకోల్పోతున్న జిల్లా అధికారి..
సీఐ మల్లయ్యపై అత్యాచారం కేసు, పరారీ
మరో రాసలీలల వీడియో వైరల్
(గుంటూరు, ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లాలో ఇప్పటికే పోలీసు అధికారులు, సిబ్బంది అసాంఘిక కార్యకలాపాలు అనేకం వెలుగు చూశాయి. పోలీసులే మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అయినా పోలీసు శాఖ ప్రక్షాళనకు పోలీసు బాస్ చర్యలు తీసుకోవడంలేదు. నేరాలకు పాల్పడుతున్న అధికారులకు, పోలీసులకు నిఘా విభాగం కూడా కొమ్ము కాస్తున్నదన్న విమర్శలున్నాయి. సరైన నిఘా ఉంటే ఇన్ని నేరాలు జరగేవి కాదన్న అభిప్రాయం జిల్లా వాసుల నుంచి వ్యక్తమవుతోంది. తాజాగా సీఐ చిన మల్లయ్యపై వినుకొండ స్టేషన్‌లో అత్యాచారం కేసు నమోదు కావడంతో.. అయన పరారీలో ఉన్నాడు. ఆయన కోసం రెండు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
సీఐ చిన మల్లయ్య మహా ముదురులా మారి పోయాడు. వినుకొండ బ్రహ్మణపల్లిలో ఫాంహౌస్ ఏర్పాటు చేసుకొని రాసలీలు సాగించాడు. అతనిపై అత్యాచారం కేసులో.. సదరు మహిళ న్యాయస్థానంలో కూడా వాంగ్మూలం ఇచ్చింది. అయనను అరెస్టు చేసేం దుకు ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు రెండు పోలీ సు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కేసు విచారణలో ఉండగానే మరో మహిళలతో సీఐ మల్లయ్య రాసలీలల విడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పోలీసు పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. మల్లయ్యపై కేసు నమోదు చేసి పోలీసు ఉన్నతాధికారులు మిన్నకున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఐ పరారీ కావడానికి కూడా కొందరు పోలీసులు సహకరించారన్న ఆరోపణలున్నాయి. కారంపూడిలో తుపాకీతో టీడీపీ నేతలను బెదిరించిన ఉదంతంలో సీఐ మల్లయ్య వీఆర్‌లో ఉన్నారు. మల్లయ్యపై చర్యల కోసం ఎస్పీ కృష్ణారావు ఐజీకి నివేదిక పంపినట్టు సమాచారం.
ప్రక్షాళన దిశగా చర్యలేవీ
జిల్లా పోలీసు శాఖలో అక్రమాలు.. నేరాలు వెలుగు చూస్తున్నా.. పోలీసు బాస్ సరైన రీతిలో స్పందించడం లేదన్న విమర్శలున్నాయి. పోలీసు శాఖపై పూర్తిగా నిఘా కొరవడటంతో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు న్నారన్న ఆరోపణలున్నాయి. వీరిపై కఠిన చర్యలు తీసుకొకపోవడం వల్లే ఈ ఘటనలు కొనసాగుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చోట్ల కిక్రెట్ బెట్టింగులు, గంజాయి విక్రేతలు.. పేకాట నిర్వహణదారులతో పోలీసులు అంటకాగుతున్నారన్న ఆరోపణలుయి. కొన్ని స్టేషన్‌లలో ప్రైవేట్ పంచాయతీలు జోరుగా సాగుతున్నాయి. అయితే పోలీసు నిఘా విభాగం క్షేత్రస్థాయి ఘటనలపై నివేదికలు ఇవ్వడం లేదని సమాచారం. దిగజారిన జిల్లా ప్రతిష్టను ఇనుమడింపజేసేందుకు నడుం కట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News