నేడు పవన్ ఇంటికి సీఎం చంద్రబాబు
ABN , Publish Date - May 02 , 2026 | 09:30 AM
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 35లో ఉన్న పవన్ నివాసానికి సీఎం వెళ్లనున్నారు.
హైదరాబాద్, మే 2: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు(శనివారం) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించనున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 35లో ఉన్న పవన్ కల్యాణ్ నివాసానికి సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు వెళ్లనున్నారు. పవన్‌ను కలిసి ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. ఇటీవల ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్న ఉపముఖ్యమంత్రి.. గత 10 రోజులుగా హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే కాసేపట్లో నందగిరి హిల్స్‌లో ఇటీవల మరణించిన రీజెన్సీ సెరామిక్స్ అధినేత జి.ఎన్. నాయుడు కుటుంబసభ్యులను సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు.
గత నెలలో పాలనా పరమైన అంశాలపై అధికారులతో చర్చిస్తున్న సమయంలో డిప్యూటీ సీఎం పవన్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వెంటనే ఆస్పత్రికి వెళ్లగా.. పరీక్షలు నిర్వహించిన వైద్యులు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. శస్త్రచికిత్స చేసిన అనంతరం పది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని, దీర్ఘకాలం పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. వైద్యుల సూచనల మేరకు పవన్ ప్రస్తుతం హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి...
Read Latest AP News And Telugu News