Share News

రీల్స్‌ పిచ్చితో నిప్పంటించుకున్నాడు..

ABN , Publish Date - May 02 , 2026 | 06:17 AM

రీల్స్‌ పిచ్చితో ఇంటర్‌ విద్యార్థి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం..

రీల్స్‌ పిచ్చితో నిప్పంటించుకున్నాడు..

  • శ్రీసత్యసాయి జిల్లాలో ఇంటర్‌ విద్యార్థికి తీవ్ర గాయాలు

కొత్తచెరువు, మే1(ఆంధ్రజ్యోతి): రీల్స్‌ పిచ్చితో ఇంటర్‌ విద్యార్థి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం పోతుకుంటలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన అంజనేయులు కుమారుడు శివకుమార్‌ ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ చదువుతున్నాడు. గ్రామంలోని పాత సచివాలయం వద్ద స్నేహితులతో కలిసి శుక్రవారం రీల్స్‌ చేశాడు. ఈ క్రమంలో శివకుమార్‌ ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు ఎక్కువ కావడంతో అతని స్నేహితులు చొక్కాను లాగేశారు. అప్పటికే శివకుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి..

మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు

భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌‌ను తోసిపుచ్చిన ఈసీ

Updated Date - May 02 , 2026 | 06:29 AM