హలో.. నేను.. ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ని మాట్లాడుతున్నా.. రూ.10 వేలు పంపించండి
ABN , Publish Date - May 02 , 2026 | 11:13 AM
అనంతపురం జిల్లా ఆహారకల్తీ నిరోధక శాఖ అధికారులు ఇటీవల కాలంలో హోటళ్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. నిబంధనలు పాటించిన హోటల్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తున్నారు.
లేకుంటే హోటల్‌ను సీజ్ చేస్తాం
నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ల దందా
నమ్మి డబ్బు పంపుతున్న వ్యాపారులు
మోసపోయామని తెలుసుకుని ఆవేదన
హలో.. నేను ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ను మాట్లాడుతున్నా. మీ హోటల్‌లో భోజనం చేసిన వ్యక్తికి వాంతులు, విరేచనాలు అయ్యాయని ఫిర్యాదు చేశారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉందా? ఎక్స్‌పైరీ అయిన చికెన్‌ను ఫ్రిజ్‌లో పెట్టి వండుతున్నారా? రూ.10వేలు పంపండి. లేకుంటే హోటల్‌ను సీజ్ చేస్తాం.
- ఇటీవల ఓ హోటల్ యజమానికి ఫోన్‌లో నకిలీ అధికారి బెదిరింపు
వెంటనే తేరుకున్న హోటల్ యాజమాని.. జిల్లా ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారిని కలిసి విషయం తెలిపారు. అదంతా మో సపుకాల్ అని తెలియడంతో షాక్‌కు లోనయ్యారు. ఇలా అనేకమంది హోటల్ నిర్వాహకులకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కొందరు అవతలి వ్యక్తి ఫుడ్ ఇన్‌స్పెక్టరే అని నిమ్మ రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు పంపుతున్నారు. విషయం తెలిశాక జేబులు తడుముకుంటున్నారు. మోసపోయిన విషయం బయటకు చెప్పుకోలేకపోతున్నారు.
అనంతపురం: జిల్లా ఆహారకల్తీ నిరోధక శాఖ అధికారులు ఇటీవల కాలంలో హోటళ్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. నిబంధనలు పాటించిన హోటల్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ శాంపిళ్లు సేకరించి, ల్యాబ్‌కు పంపుతున్నారు. కేసులు పెట్టి చలానాలు రాస్తున్నారు. దీనిని క్యాష్ చేసుకునేందుకు కేటుగాళ్లు రంగంలోకి దిగారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అంటూ ఫోన్ చేసి, బెదిరించి డబ్బు గుంజుతున్నారనను. బస్టాండు, మెయిన్ సర్కిల్, రద్దీ ప్రాంతాల్లోని హోటళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. హోటల్ నేమ్ బోర్టులపైనున్న నంబర్లకు ఫోన్లు చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ బెదిరింపులకు దిగుతున్నారు. నిర్వహణలోపాలను లేవనెత్తుతూ డబ్బు పంపాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో హోటళ్ల నిర్వాహకులు హడలిపోతున్నారు.
రాష్ట్ర అధికారుల దృష్టికి..
ఉమ్మడి జిల్లాలో మోసగాళ్ల బెదిరింపులు, వసూళ్ల వ్యవహారాలను జిల్లా ఆహారకల్తీ నిరోధక శాఖ యంత్రాంగం.. రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తోంది. ముఠా ఆగడాలతో శాఖకు చెడ్డపేరు వస్తోందని వివరిస్తోంది. ఈ అంశంపై తామేమీ చేయలేమని రాష్ట్రస్థాయి అధికారులు సమాధానమిస్తున్నట్లు సమాచారం. ‘తనిఖీల్లో ఏ చిన్నలోపం కనిపించి నా నోటీసులు, కే సులు, చలనాలం టూ చెమటలు పట్టిస్తారు. ఆ శాఖ పేరుతో నకిలీలు ఫోన్లు చేసి, డబ్బు వసూలు చేస్తుంటే పట్టించుకోరా?’ అని హోటళ్ల యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. ఇలాంటి వాటిపై జిల్లాస్థాయిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసి మోసాల నివారణకు చర్యలు తీసుకోవాలని హోటళ్ల నిర్వాహకులు కోరుతున్నారు.
అధికారులు ఫోన్ చేయరు
తాము ఫుడ్ సేఫ్టీ అధికారులమనీ, ఇన్‌స్పెక్టర్లమని ఎవరైనా ఫోన్‌చేసి బెదిరిస్తే న మ్మవద్దు. జిల్లా ఆహారకల్తీ నియంత్రణ శాఖ అధికారులెవరూ ఫోన్ చేయరన్న వి షయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిబంధనల అమలులో భాగంగా ఆహారకల్తీ నియంత్రణ శాఖ అధికారులు నేరుగా హోటళ్లకు వెళ్లి తనఖీలు నిర్వహిస్తారు. మోసగా ళ్లు ఫోన్ చేస్తే నంబరు రాసి పెట్టుకోవాలి. అవసరమైతే వాయిస్ రికార్డు చేయా లి. వివరాలు ఇస్తే పోలీసు శాఖకు పంపి చర్యలు తీసుకునేలా సిఫార్సు చేస్తాం.
- దేవరాజు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్
ఈ వార్తలు కూడా చదవండి:
నాగుపాముతో ఆటలాడాడు.. నిమిషాల్లో ప్రాణం పోయింది..
Read Latest Telangana News and National News