కివీస్‌కు భారీ షాక్.. ఇంగ్లండ్ టూర్‌కి స్టార్ ప్లేయర్ దూరం
ABN , Publish Date - May 02 , 2026 | 10:04 AM
త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న న్యూజిలాండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భుజం గాయంతో బాధపడుతున్న న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ నెల రోజుల పాటు ఆటకు దూరం కానున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న న్యూజిలాండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భుజం గాయంతో బాధపడుతున్న న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ నెల రోజుల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఐపీఎల్ 2026లో భాగంగా వారం రోజుల క్రితం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ అందుకునే క్రమంలో ముంబై తరఫున ఆడుతున్న శాంట్నర్ భుజానికి గాయమైంది. ఆ మ్యాచ్ నుంచి మధ్యలోనే తప్పుకున్న అతడు.. లీగ్‌కు కూడా పూర్తిగా దూరమయ్యాడు.
ఐపీఎల్ 2026లో అతడు నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. గాయం కారణంగా అతడు ఇటీవలే స్వదేశానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో శాంట్నర్‌కు పరీక్షలు నిర్వహించిన క్రికెట్ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అతడి గాయం విషయంపై స్పష్టమైన ప్రకటన ఇచ్చింది. 'ప్రత్యేక వైద్య నిపుణుడిని శాంట్నర్ కలిశాడని, గాయం నుంచి కోలుకునే క్రమంలో తగినంత విశ్రాంతితో పాటు రీహాబిలిటేషన్ కూడా అవసరం అని వైద్యులు తేల్చారని ఎన్‌జెడ్‌సీ ఒక ప్రకటనలో వెల్లడించింది. తాజా పరిణామాల కారణంగా ఐర్లాండ్‌తో జరిగే ఏకైక టెస్టుతో పాటు లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగే తొలి టెస్టు నుంచి అతను తప్పుకోనున్నాడని సమాచారం.
శాంటర్న్ గాయం నుంచి కోలుకొని ఫిట్‌నెస్ సాధిస్తే... ఇంగ్లండ్‌తో తర్వాతి రెండు టెస్టుల్లో ఆడించాలా లేదా అనేదానిపై టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంటుంది. 2026 టీ20 ప్రపంచకప్‌లో శాంట్నర్ సారథ్యంలోనే కివీస్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. కివీస్‌పై భారత్ ఘన విజయం సాధించి.. టీ20 ట్రోఫీని ముద్దాడింది. ఇక ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ శాంట్నర్ స్థానంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌ను జట్టులోకి తీసుకుంది. మహారాజ్ ఎంఐ జట్టులో చేరినప్పటికీ ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
ఇవి కూడా చదవండి:
ఆ యువకులకు ఈ విజయం అంకితం: అక్షర్ పటేల్
టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. యువ బౌలర్లు దూరం