టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. యువ బౌలర్లు దూరం
ABN , Publish Date - May 02 , 2026 | 08:11 AM
ఐపీఎల్ 2026లో టీమిండియా ప్లేయర్లు ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ టోర్నీ తర్వాత ఆఫ్గనిస్థాన్, ఇంగ్లండ్ సిరీస్‌లు జరగనున్నాయి. ఈ క్రమంలోనే భారత జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో టీమిండియా ప్లేయర్లు ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ టోర్నీ తర్వాత ఆఫ్గనిస్థాన్, ఇంగ్లండ్ సిరీస్‌లు జరగనున్నాయి. దీని కోసం బీసీసీఐ కూడ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే భారత జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆఫ్గనిస్థాన్, ఇంగ్లండ్ సిరీస్‌లకు యువ పేసర్లు హర్షిత్ రాణా, ఆకాశ్‌దీప్ దూరమయ్యారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
హర్షిత్ మోకాలి గాయం కాగా ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అలానే మరో యువ బౌలర్ల ఆకాశ్ దీప్ వెన్ను గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఇద్దరికీ రిహాబిలిటేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే వీరికి పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు చాలా సమయం అవసరమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఐపీఎల్ 2026లో కేకేఆర్‌లో భాగంగా ఉన్నారు. కానీ, వారి వారి గాయాల కారణంగా ఈ సీజన్‌కు దూరమయ్యారు.
ఐపీఎల్ ముగిసిన తర్వాత, భారత్ ఆఫ్ఘనిస్తాన్‌తో 3 వన్డేల సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. అలాగే, ఆ తర్వాత ఐర్లాండ్‌తో రెండు టీ20లు, ఇంగ్లాండ్‌తో వైట్-బాల్ సిరీస్ కోసం భారత జట్టు యూకే పర్యటనకు వెళ్లనుంది. ఈ కీలక పర్యటనల్లో ఇద్దరు ప్రధాన పేసర్లు అందుబాటులో లేకపోవడం జట్టుకు పెద్ద లోటేనని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఐర్లాండ్ సిరీస్ కు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేయనున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి:
విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రియాన్ పరాగ్...