పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. 15 చోట్ల ప్రారంభమైన రీపోలింగ్..
ABN , Publish Date - May 02 , 2026 | 07:29 AM
బుధవారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్టు రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులు ఈసీకి నివేదికలు సమర్పించారు. డైమండ్ హార్బర్ నుంచి 29 ఫిర్యాదులు.. మగ్రహట్ నుంచి 13 ఫిర్యాదులు ఈసీకి అందాయి.
కోల్‌కతా, మే 1: పశ్చిమ బెంగాల్, దక్షిణ 24 పరగణాస్‌లో 15 చోట్ల రీపోలింగ్ ప్రారంభం అయింది. మగ్రహట్ పశ్చిమ నియోజవర్గంలోని 11 బూత్‌లు, డైమండ్ హార్బర్‌లోని నాలుగు బూత్‌లలో రీపోలింగ్ జరుగుతోంది. శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. కాగా, బుధవారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్టు రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులు ఈసీకి నివేదికలు సమర్పించారు. డైమండ్ హార్బర్ నుంచి 29 ఫిర్యాదులు.. మగ్రహట్ నుంచి 13 ఫిర్యాదులు ఈసీకి అందాయి.
రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులు సమర్పించిన నివేదికలు ఆధారంగా రీపోలింగ్ జరపాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 58(2).. ఆర్‌పీ యాక్ట్, 1951 ప్రకారం రీపోలింగ్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు ఈసీ తెలిపింది. డైమండ్ హార్బర్‌లోని ఫాల్టా నియోజకవర్గంలో రీపోలింగ్‌పై శనివారం నిర్ణయం తీసుకుంటామని, ఆ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి నివేదిక ఇంకా అందాల్సి ఉందని ఈసీ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
ఆ ఏరియాల్లో 10.30నుంచి కరెంట్ కట్..
దోశకు అంతర్జాతీయ గుర్తింపు.. టాప్ 50లో మూడు స్థానాలు..