దోశకు అంతర్జాతీయ గుర్తింపు.. టాప్ 50లో మూడు స్థానాలు..
ABN , Publish Date - May 02 , 2026 | 06:57 AM
భారతీయులు ఎంతగానో ఇష్టపడే దోశకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. టేస్ట్‌అట్లాస్ విడుదల చేసిన టాప్ 50 ప్యాన్ కేక్స్ లిస్ట్‌లో మూడు ర్యాంకులు కొట్టేసింది.
ఇంటర్‌నెట్ డెస్క్: భారత దేశంలో భాష, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎక్కువ మంది ఇష్టపడే వంటకం దోశ అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేవలం మార్నింగ్ టిఫిన్ కోసం మాత్రమే కాదు.. మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్‌లో కూడా దోశలు తినే వాళ్లు చాలా మందే ఉన్నారు. దోశకు కేవలం ఇండియాలోనే కాదు భారతీయులు ఉన్న అన్ని దేశాల్లో డిమాండ్ ఉంది. విదేశీయులు కూడా దోశ తినడానికి మక్కువ చూపిస్తున్నారు.
భారతీయులు ఎంతగానో ఇష్టపడే దోశకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. టేస్ట్‌అట్లాస్ విడుదల చేసిన టాప్ 50 ప్యాన్ కేక్స్ లిస్ట్‌లో మూడు ర్యాంకులు కొట్టేసింది. టేస్ట్‌అట్లాస్ తాజాగా 2026 మే నెలకు సంబంధించి 50 బెస్ట్ ప్యాన్ కేక్స్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ లిస్ట్‌లో 4.3 రేటింగ్‌తో మసాలా దోశ 6వ ర్యాంకు సాధించింది. 4.2 రేటింగ్‌తో సాధారణ దోశ 15వ ర్యాంకు సాధించింది. 4.1 రేటింగ్‌తో పేపర్ దోశ 35వ ర్యాంకు సాధించింది. ఇలా 50లో మూడు ర్యాంకులు మన ఇండియన్ ఫుడ్‌కు రావటం విశేషం. దోశ స్థానిక వంటకం ముద్రను చెరిపేసుకుని గ్లోబల్ స్టార్‌గా అవతరించింది.
ఇక, 4.4 రేటింగ్‌తో మొదటి స్థానంలో లాట్వియాకు చెందిన 'కార్టుపెలు పంకుకాస్' ఉంది. రెండవ స్థానాన్ని ఫ్రాన్స్‌కు చెందిన 'క్రేప్స్ సుక్రేస్' సొంతం చేసుకుంది. 4.3 రేటింగ్‌తో మూడవ స్థానంలో ఫ్రాన్స్‌కే చెందిన క్లాసిక్ 'క్రేప్స్' నిలిచింది. ఫ్రాన్స్‌కు చెందిన 'నుటెల్లా క్రేప్స్' నాల్గవ స్థానంలో.. చైనాకు చెందిన 'జియాన్ బింగ్' ఐదవ స్థానంలో నిలిచాయి.
ఇవి కూడా చదవండి
బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు