హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 10.30నుంచి కరెంట్ కట్..
ABN , Publish Date - May 02 , 2026 | 07:19 AM
హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్ డివిజన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీఏడీఈ నాగేశ్వరరావు తెలిపారు.
నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
హైదరాబాద్: ఆజామాబాద్ డివిజన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీఏడీఈ నాగేశ్వరరావు తెలిపారు. బౌద్ధనగర్, సీఇ కాలనీ, మిల్క్‌బూత్ ఏరియా ప్రాంతాల్లో ఉదయం 10.30నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, బర్కత్‌పుర బస్‌డిపో, ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, మూన్ కేఫ్, శంకర్‌మఠ్ మార్కెట్ ఏరియా ప్రాంతాల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.
ఉప్పల్: నిర్వహణ పనుల కారణంగా శనివారం ఉప్పల్ భగాయత్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఏఈ బి.కిరణ్ కుమార్ తెలిపారు. ఉదయం 10.00 నుంచి 10.30 గంటల వరకు 11కేవీ హెచ్‌ఎండీఏ ఫీడర్ పరిధిలో, ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు 11కేవీ ఆర్టీఏ ఫీడర్ పరిధిలో కరెంట్ ఉండదని తెలిపారు.
బోడుప్పల్‌లో...
బోడుప్పల్, ఇందిరానగర్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు బోడుప్పల్ ఏసీ ఎన్.వేణుగోపాల్ తెలిపారు. ఉదయం 11.00 నుంచి 11.30 గంటల వరకు 33/11కేవీ ఇందిరానగర్ సబ్ స్టేషన్‌కు చెందిన 11కేవీ వివేకానంద ఫీడర్ పరిధిలో, సాయంత్రం 4.00 నుంచి 4.30 వరకు 33/11కేవీ బోడుప్పల్ సబ్ స్టేషన్‌కు చెందిన 11కేవీ ఇందిరానగర్ ఫీడర్ పరిధిలో కరెంట్ ఉండదని తెలిపారు.
బౌద్ధనగర్: నూతన డీటీఆర్ ఏర్పాటు, చెట్లకొమ్మల తొలగింపు, లైన్ మరమ్మతుల కారణంగా శనివారం అజామాబాద్ విద్యుత్ సబ్‌స్టేషన్ కార్యాలయం పరిధిలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని ఏడీఈ జి.నాగేశ్వరరావు తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు బౌద్ధనగర్, సీఈకాలనీ మిల్క్‌బూత్ ఏరియా, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు బర్కత్‌పుర బస్‌డిపో, అజామాబాద్ ఇండస్ర్ట్రియల్ ఎస్టేట్, మూన్‌కేఫ్, శంకరమఠం మార్కెట్ ఏరియాలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News