మేం చేస్తున్నది యుద్ధమే కాదు!
ABN , Publish Date - May 02 , 2026 | 06:21 AM
ఇరాన్‌పై తాము చేస్తున్నది యుద్ధమే కాదంటూ ట్రంప్ యంత్రాంగం నాలుక మడతేస్తోంది. తాము కేవలం చిన్న సైనిక చర్య చేపట్టామని చెబుతోంది..
కాంగ్రెస్ ఆమోదం లేకపోవడంతో ట్రంప్ యంత్రాంగం నాలుక మడత
ఇరాన్‌పై యుద్ధం మొదలై 60 రోజులు
వాషింగ్టన్/టెహ్రాన్/దుబాయ్, మే 1: ఇరాన్‌పై తాము చేస్తున్నది యుద్ధమే కాదంటూ ట్రంప్ యంత్రాంగం నాలుక మడతేస్తోంది. తాము కేవలం చిన్న సైనిక చర్య చేపట్టామని చెబుతోంది. అధ్యక్షుడు ట్రంప్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, కీలక అధికారులు అంతా ఇదే పాట పాడుతున్నారు. అధ్యక్షుడు ఏ దేశంపై యుద్ధం మొదలుపెట్టినా.. 60 రోజుల్లోగా అమెరికా చట్టసభ కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలి, లేకుంటే యుద్ధం ఆపేయాలన్న నిబంధనే దీనికి కారణం. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ట్రంప్ యుద్ధం ప్రారంభించినా.. చట్టసభ కాంగ్రె్‌సకు మార్చి 2న అధికారికంగా సమాచారమిచ్చారు. దీనితో శుక్రవారం నాటికి 60 రోజులు పూర్తవుతోంది. ఇంకా కాంగ్రెస్ ఆమోదం రాలేదు. దీనిపై అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ జాన్సన్ మాట్లాడుతూ.. ట్రంప్ ప్రభుత్వం యుద్ధమేదీ చేయడం లేదని, పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్‌తో కాల్పుల విరమణ కొనసాగుతున్న నేపథ్యంలో 60రోజుల్లోగా చట్టసభ ఆమోదం పొందాలన్న నిబంధన ప్రస్తుతానికి వర్తించదని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పేర్కొన్నారు. అయితే దీనిని ప్రతిపక్ష డెమోక్రాట్ సెనేటర్లు తిరస్కరిస్తున్నారు. శుక్రవారం నాటికి గడువు ముగిసినట్టేనని, ఇరాన్‌పై యుద్ధం ఆపి బలగాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇరాన్‌పై యుద్ధం కొనసాగించాల్సి వస్తే.. భీకర స్థాయిలో విరుచుకుపడేందుకు అమెరికా సెంట్రల్ కమాండ్ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం ‘డార్క్ ఈగిల్’ హైపర్ సోనిక్ క్షిపణులను వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రతిపాదించింది.
ఇవి కూడా చదవండి..
మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు
భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌ను తోసిపుచ్చిన ఈసీ