Share News

ఆ యువకులకు ఈ విజయం అంకితం: అక్షర్ పటేల్

ABN , Publish Date - May 02 , 2026 | 08:58 AM

ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ విజయాన్ని ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన డీసీ అభిమానులకు అంకితం చేస్తున్నట్లు ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తెలిపాడు.

ఆ యువకులకు ఈ విజయం అంకితం: అక్షర్ పటేల్
Akshar Patel

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న(శుక్రవారం) రాజస్థాన్ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రక విజయం సాధించింది. ఇక అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ తన మనసులోని మాటలను పంచుకున్నాడు. ఈ విజయాన్ని ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన డీసీ అభిమానులకు అంకితం చేసినట్లు అక్షర్ పటేల్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తమ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని వెల్లడించాడు.


మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్‌లో అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. 'గత మ్యాచ్ ఓటమి తర్వాత కూడా మేము సానుకూల దృక్పథంతోనే ఉన్నాము. మన పనిని మనం సరిగ్గా చేస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయని నమ్మాము. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. మేము వేసుకున్న ప్రణాళికలు నూటికి నూరు శాతం అమలయ్యాయి. ముఖ్యంగా పవర్‌ప్లేలోనే ప్రత్యర్థి జట్టులోని కీలక బ్యాటర్ల వికెట్లు తీయడం మ్యాచ్ మలుపు తిప్పింది' అని ఆయన అభిప్రాయపడ్డారు.


చాలా కాలం తర్వాత జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చిన స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ప్రదర్శనపై అక్షర్ ప్రశంసల వర్షం కురిపించాడు. 'దాదాపు మూడు నెలల విరామం తర్వాత వచ్చి, ఇలాంటి పిచ్‌పై అద్భుతమైన ప్రదర్శన చేయడం స్టార్క్ గొప్పతనం. స్టార్క్ ఫామ్‌లోకి రావడం జట్టుకు పెద్ద సానుకూలాంశం. స్టార్క్ తన అనుభవంతో ఢిల్లీ బౌలింగ్ విభాగానికి కొత్త బలాన్ని ఇచ్చారు. ఇక ఈ విజయాన్ని ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు అంకింతం ఇస్తున్నాను. ఆ ఇద్దరు సభ్యులకు కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ గెలుపు వారి ఆత్మకు శాంతి చేకూరుస్తుందని ఆశిస్తున్నాను' అని అక్షర్ పటేల్ తెలిపాడు.


గతనెల 27న ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్ చూసి ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో యజ్ఞ భాటియా (20), అభవ్ భాటియా (14) అనే ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో వారిద్దరూ మరణించారు. తాజాగా రాజస్థాన్‌పై విజయాన్ని వారిద్దరికీ అంకితం చేశాడు ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్.


ఇవి కూడా చదవండి:

టీమిండియాకు భారీ ఎదురు దెబ్బ.. యువ బౌలర్లు దూరం

విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రియాన్ పరాగ్...

Updated Date - May 02 , 2026 | 10:20 AM