రాష్ట్రంలో స్టార్ హోటళ్ల మెనూ ధరలు 10 శాతం పెంపు
ABN , Publish Date - May 02 , 2026 | 05:50 AM
వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగినందున స్టార్ హోటళ్లలో మెనూ ధరలు 10% పెంచాలని...
అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగినందున స్టార్ హోటళ్లలో మెనూ ధరలు 10% పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఏపీ స్టార్ హోటళ్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్‌వీ స్వామి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వాణిజ్య సిలిండర్ ధర ఒకేసారి రూ.993 పెంచడంతో హోటళ్ల రంగం కుదేలవుతుందన్నారు. పెరిగిన పెట్టుబడి ఖర్చుల వల్ల తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో వేలాది మంది కార్మికుల ఉపాధిని కాపాడేందుకు, హోటల్ రంగాన్ని నిలబెట్టుకునేందుకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నేను సీఎం కావాలన్నా.. కుర్చీ ఖాళీగా లేదు
జీవితంలో ఓడి... పదిలో గెలిచిన వర్షిత..
Read Latest Telangana News and National News