నేను సీఎం కావాలన్నా.. కుర్చీ ఖాళీగా లేదు: ఖర్గే
ABN , Publish Date - May 01 , 2026 | 06:02 AM
‘మీడియా, హోంమంత్రి పరమేశ్వర, ప్రజలతో పాటు పైవారు (అధిష్ఠానం) నేను సీఎం అయితే బాగుంటుందంటున్నారు...
బెంగళూరు, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): ‘‘మీడియా, హోంమంత్రి పరమేశ్వర, ప్రజలతో పాటు పైవారు (అధిష్ఠానం) నేను సీఎం అయితే బాగుంటుందంటున్నారు. కానీ దానికి అదృష్టం ఉండాలి. అయినా ఆ పోస్టు ఖాళీగా లేదు కదా’’ అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం కలబురగిలో మాట్లాడిన ఆయన కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ప్రస్తుతానికి లేదని స్పష్టంచేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు అంశం త్వరలోనే పరిష్కారమవుతుందని తెలిపారు. నాయకత్వ మార్పు జరగాలంటే సోనియాగాంధీ, రాహుల్‌గాంఽధీ, తాను కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఖర్గే తెలిపారు. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి పోస్టు ఖాళీ లేదని.. అయినా సిద్దరామయ్య పూర్తి కాలం కొనసాగుతారని చెప్పలేమన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అమెరికాకు హ్యాండిచ్చిన పాక్.. ఇరాన్‌కు సాయం!
పుతిన్ ఆఫర్‌ను తిరస్కరించిన ట్రంప్.. 90 నిమిషాలు మాట్లాడుకున్న నేతలు..