Share News

పశ్చిమాసియా దేశాలకు భారీగా ఆయుధాల అమ్మకం.. అమెరికా కీలక నిర్ణయం..

ABN , Publish Date - May 02 , 2026 | 11:53 AM

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్, ఖతర్, కువైట్, యూఏఈ మొదలైన దేశాలకు ఆయుధాలను విక్రయించాలని నిర్ణయించుకుంది.

పశ్చిమాసియా దేశాలకు భారీగా ఆయుధాల అమ్మకం.. అమెరికా కీలక నిర్ణయం..
US arms deal 2026

వాషింగ్టన్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్, ఖతర్, కువైట్, యూఏఈ మొదలైన దేశాలకు ఆయుధాలను విక్రయించాలని నిర్ణయించుకుంది. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ అమెరికా తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం ఆందోళన కలిగిస్తోంది (US arms deal 2026).


8.6 బిలియన్ డాలర్ల (రూ.81 వేల కోట్లు) విలువైన ఆయుధాల విక్రయానికి అమెరికా విదేశాంగ శాఖ అమోదం లభించింది. ఆధునిక రక్షణ వ్యవస్థలు, క్షిపణి రక్షణ పరికరాలు, ప్రిసిషన్ వెపన్ సిస్టమ్స్ వంటి పరికరాలను ఇజ్రాయెల్ సహా పశ్చిమాసియా దేశాలకు అమెరికా విక్రయించనుంది. ఇందులో ఖతర్ 4 బిలియన్ డాలర్ల విలువైన క్షిపణి రక్షణ వ్యవస్థలతో పాటు లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించగల ఆయుధ వ్యవస్థలను అందుకోనుంది (Qatar Kuwait UAE defense sales).


అలాగే, కువైట్ 2.5 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అమెరికా నుంచి పొందనుంది (US military exports). యూఏఈ, ఇజ్రాయెల్ దేశాలకు అమెరికా గైడెడ్ రాకెట్ లాంఛర్లను విక్రయించనుంది. సాధారణంగా అమెరికా ఆయుధ విక్రయాలను ఆ దేశ కాంగ్రెస్ రివ్యూ చేయాలి. అయితే ట్రంప్ యంత్రాంగం అత్యవసర అధికారాలను ఉపయోగించి వీలైనంత వేగంగా ఈ ఆయుధాలను విక్రయించాలని నిర్ణయించుకుంది.


ఇవి కూడా చదవండి..

ఒప్పందం కుదరకపోతే ఇతర మార్గాలు.. ఇరాన్‌ను హెచ్చరించిన ట్రంప్..


బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - May 02 , 2026 | 11:53 AM