గుంతకల్లు వరకూ తిరుమల ఎక్స్‌ప్రెస్
ABN , Publish Date - Apr 30 , 2026 | 10:12 AM
విశాఖ, కడప మధ్య నడుస్తున్న తిరుమల డెయిలీ ఎక్స్ప్రెస్ను గుంతకల్లు వరకూ పొడిగించనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం
15న ప్రారంభం
గుంతకల్లు(అనంతపురం): విశాఖ-కడప మధ్య నడుస్తున్న తిరుమల డెయిలీ ఎక్స్ప్రెస్ను గుంతకల్లు వరకూ పొడిగించనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో తిరుమల ఎక్స్‌ప్రెస్ (నం. 18521/22) రైలును విశాఖ-కడప-విశాఖ మధ్యన నడిపేవారు. అదే రైలును కడప-గుంతకల్లు-కడప మధ్య అన్ రిజర్వ్‌డ్ ఎక్స్‌ప్రెస్ (07521/22) రైలుగా మార్చి నడిపేవారు. దీంతో గుంతకల్లు నుంచి కడప మధ్యలో రైలెక్కి విశాఖ వరకూ వివిధ స్టేషన్లలో దిగాలనుకునే ప్రయాణికులకు రిజర్వేషన్ దొరక్క ఇబ్బందులు పడేవారు.
ఎలాగోలా వెళ్దామనుకుని గుంతకల్లులో అన్ రిజర్వ్‌డ్ రైలు ఎక్కే ప్రయాణికులను కడపలో రిజర్వ్‌డు టికెట్ ప్యాసింజర్లు వచ్చి లేపేవారు. సరైన టిక్కెట్టు లేకపోతే టీటీఈలు.. ప్రయాణికులను రిజర్వేషన్ బోగీల్లోంచి దించేసేవారు. ఈ పరిస్థితుల్లో త్వరలో సౌత్ కోస్టు రైల్వేజోన్ ప్రారంభం కానుండగా కడప-గుంతకల్లు అన్‌రిజర్వ్‌ద్ ఎక్స్‌ప్రెస్ ను రద్దుచేసి, తిరుమల ఎక్స్ప్రెస్ను గుంతకల్లు వరకూ పొడిగించారు.
గుంతకల్లు-విశాఖపట్టణం తిరుమల ఎక్స్‌ప్రెస్ (18522) మే 15వ తేదీ నుంచి గుంతకల్లులో మధ్యాహ్నం ఒకటిన్నరకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు విశాఖపట్టణానికి చేరుకుంటుంది. దీని తిరుగు ప్రయాణపు రైలు (18521) మే 13వ తేదీ నుంచి విశాఖపట్టణంలో మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు గుంతకల్లుకు చేరుతుందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..
ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే!
Read Latest Telangana News and National News