నేడు టెన్త్ ఫలితాలు విడుదల
ABN , Publish Date - Apr 30 , 2026 | 03:25 AM
పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను పాఠశాల విద్యాశాఖ గురువారం ఉదయం 11గంటలకు విడుదల చేయనుంది. ఈ మేరకు మంత్రి లోకేశ్...
ఉదయం 11 గంటల నుంచి అందుబాటులోకి
అమరావతి, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను పాఠశాల విద్యాశాఖ గురువారం ఉదయం 11గంటలకు విడుదల చేయనుంది. ఈ మేరకు మంత్రి లోకేశ్ బుధవారం ఎక్స్‌లో వెల్లడించారు. విద్యార్థులు results.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు. మనమిత్ర వాట్సాప్ నంబరు 9552300009కు మెసేజ్ చేసి కూడా తెలుసుకోవచ్చు. లీప్ యాప్, డిజిలాకర్‌లోనూ ఫలితాలు అందుబాటులో ఉంచుతారు. అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయుల లాగిన్లలో ఆయా పాఠశాల విద్యార్థుల ఫలితాలు తెలుసుకోవచ్చు. కాగా, రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు 6.38లక్షల మంది ఈ ఏడాది పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా, 6.3లక్షల మంది పరీక్షలు రాశారు.