Share News

బీసీలను అణచివేసింది వైసీపీనే..

ABN , Publish Date - Apr 28 , 2026 | 09:57 AM

బీసీలపై అక్రమ కేసులు, నిర్బంధాలు, హత్యలతో అణచివేసింది వైసీపీనేనని ప్రభుత్వ విప్‌, టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు.

బీసీలను అణచివేసింది వైసీపీనే..
Kalava Srinivasulu

  • విప్‌ కాలవ శ్రీనివాసులు

  • టీడీపీతోనే బీసీల ఎదుగుదల: ఎంపీలు బీకే, అంబికా

అనంతపురం: బీసీలపై అక్రమ కేసులు, నిర్బంధాలు, హత్యలతో అణచివేసింది వైసీపీనేనని ప్రభుత్వ విప్‌, టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. ఎంపీలు బీకే పార్థసారధి, అంబికా లక్ష్మీనారాయణ ఇతర నేతలతో కలిసి ఆయన సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సమావేశం నిర్వహించారు. విప్‌ కాలవ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీడీపీని విమర్శించడమే లక్ష్యంగా రాయలసీమ బీసీ గళం నిర్వహించారన్నారు. దశాబ్దాలుగా బలహీనవర్గాలకు అడుగడుగునా అన్యాయం చేస్తున్న వారు, వారి వారసులు సభలో కనిపించారన్నారు.


ఈ సభ జగన్‌ బలగం.. రాయలసీమ రెడ్ల దళంగా కనిపించిందన్నారు. బీసీ గళంలో మాట్లాడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితర నేతలంతా బీసీలను అణచివేసిన దుష్టశక్తులని మండిపడ్డారు. ఇలాంటి నేతల గళం బీసీ గళం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. బీసీలు, దళితులు, మైనార్టీలు ఇలా అందరికీ వైసీపీ అన్యాయం చేసిందన్నారు. ఎంపీ బీకే పార్థసారధి మాట్లాడుతూ... టీడీపీ ఆవిర్భావం తర్వాతే బీసీలకు న్యాయం జరిగిందన్నారు. అప్పుడే అన్నికులాల వారికి ఎమ్మెల్యే, మంత్రి పదవులు దక్కాయన్నారు.


zz.jpgఎన్టీఆర్‌, చంద్రబాబు వల్లే బీసీలకు న్యాయం చేకూరుతోందన్నారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... ఐదేళ్ల పాలనలో జగన్‌ పార్టీ.. బీసీలను అనేక రకాలుగా హింసించిందన్నారు. ఇప్పుడేమో వైసీపీ నేతలు అసత్యాలు పలుకుతున్నారన్నారు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు బీసీల వైపు మొగ్గుచూపుతున్నాయంటే దానికి టీడీపీనే కారణం అన్నారు. వైసీపీ బురద చల్లే యత్నాలు ఇకనైనా మానుకోవాలన్నారు. సమావేశంలో టీడీపీ నేత తలారి ఆదినారాయణ పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

అక్క అస్థిపంజరంతో బ్యాంకుకు.. ఒడిశాలో ఓ వ్యక్తి ఎంత అసహనానికి గురయ్యాడంటే..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 28 , 2026 | 09:57 AM