పరగడుపున ధనియాల నీళ్లు తాగవచ్చా?
ABN , Publish Date - Apr 28 , 2026 | 09:06 AM
పరగడుపున ధనియాల నీళ్లు తాగడం మంచిదని మన పెద్దలు చెబుతుంటారు. అయితే ఈ ధనియాల నీళ్లు ఉదయాన్నే తాగడం మంచిదేనా? అనే విషయాలను తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: వంటగదిలో సులభంగా దొరికే పదార్థాల్లో ధనియాలు (కొత్తిమీర గింజలు) ఒకటి. ధనియాలు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా ఉదయం పరగడుపున ధనియాల నీళ్లు తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రి ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ ధనియాలు నానబెట్టి, ఉదయం ఆ నీటిని వడకట్టి పరగడుపున తాగడం మంచిదని సూచిస్తున్నారు. కొందరు ఆ నీటిని కొద్దిగా మరిగించి కూడా తాగుతారు.
జీర్ణక్రియ మెరుగవుతుంది
ధనియాల నీళ్లు గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ నీళ్లు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సహాయపడటమే కాకుండా కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. ధనియాల నీళ్లు మెటబాలిజాన్ని పెంచుతాయి. దీని వల్ల కొవ్వు కరిగే ప్రక్రియ వేగవంతమవుతుంది, బరువు నియంత్రణలో సహాయపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ
డయాబెటిస్ ఉన్నవారికి ధనియాల నీళ్లు ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.అంతేకాకుండా, యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతాయి. ధనియాల నీళ్లు సహజంగా ఆరోగ్యానికి మంచివే అయినా, ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా మందులు తీసుకుంటున్నవారు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
మటన్ తినడం వల్ల నిజంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుందా..
ఇంట్లో కుక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..
For More Latest News