Share News

గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Aug 06 , 2026 | 01:35 PM

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుంతకల్లు డివిజన్‌ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైళ్లు
Special Weekly Trains

గుంతకల్లు(అనంతపురం): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుంతకల్లు డివిజన్‌ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కోయంబత్తూరు-జైపూర్‌ ప్రత్యేక వీక్లీ (06181) రైలును ఈనెల 13వ తేదీ నుంచి సెప్టెంబరు 3వ తేదీ వరకూ బుధవారాలలో నడపనున్నట్లు తెలియజేశారు. ఈ రైలు పేర్కొన్న తేదీల మధ్య గురువారాలలో నాలుగు ట్రిప్పులు నడుస్తుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (06182)ను ఈ నెల 16 నుంచి సెప్టెంబరు 6వ తేదీ వరకూ ఆదివారాలలో నాలుగు ట్రిప్పులు నడపనున్నట్లు తెలిపారు.


ఈ రైలు తిరుప్పూర్‌, ఈరోడ్‌, సేలం, జోలార్‌పట్టై, కాట్పాడి, రేణిగుంట, కడప, యర్రగుంట్ల, గుత్తి, డోన్‌, కర్నూలు సిటీ, గద్వాల, మహబూబ్‌నగర్‌, కాచిగూడ, కామారెడ్డి, నిజామాబాద్‌, బాసర, ముడ్‌ఖేడ్‌, హుజూర్‌ సాహెబ్‌ నాందేడ్‌, పూర్ణా, హింగోలి డెక్కన్‌, వాసిం, అకోలా, మల్కాపూర్‌, భూసావల్‌, జల్గావ్‌, ధరన్‌గావ్‌, ఉడ్నా, భరుచ్‌, వడోదర, గోద్రా, రత్లం, జవోరా, మండ్‌సోర్‌, నిమచ్‌, ఛత్తీస్‏ఘడ్, భిల్వారా, బిజయ్‌నగర్‌, నాసిరాబాద్‌, అజ్మీర్‌, కిషన్‌గర్‌ స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు.


train2.jpgఅలాగే బాంద్రా టెర్మినల్‌-వెలంకని ప్రత్యేక రైలు (09059)ను ఈ నెల 27వ తేదీ, సెప్టెంబరు 1వ తేదీలలో రెండు ట్రిప్పులు నడపనున్నామన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (09060) ఈ నెల 30, సెప్టెంబరు 4 తేదీలలో రెండు ట్రిప్పులు నడుస్తుందన్నారు. ఈ రైలు బోరివాలి, వసాయ్‌ రోడ్‌, పన్వేల్‌, కర్జత్‌, లోనావాలా, పూనా, డౌండ్‌, షోలాపూర్‌, వాడి, యాద్గిర్‌, క్రిష్ణా, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, వెల్లూరు కంటోన్మెంటు, తిరువనమలై, విల్లుపురం, మయిలదుతురై, నాగపట్టణం స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

విజయవాడలో విషాదం.. హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య

కర్నూలు బస్సు ప్రమాదం కేసు.. జిల్లా ఎస్పీకి ఎన్‌హెచ్‌‌ఆర్‌సీ నోటీసులు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 06 , 2026 | 01:35 PM