Share News

అరుణాచల్‌ప్రదేశ్‌లో మళ్లీ భూకంపం

ABN , Publish Date - Aug 06 , 2026 | 12:24 PM

అరుణాచల్‌ప్రదేశ్‌లోని అప్పర్ సియాంగ్ జిల్లాలో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కెల్‌పై దాని తీవ్రత 5.1గా నమోదయింది.

అరుణాచల్‌ప్రదేశ్‌లో మళ్లీ భూకంపం

ఇటానగర్, ఆగస్టు 06: అరుణాచల్‌ప్రదేశ్‌లోని అప్పర్ సియాంగ్ జిల్లాలో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కెల్‌పై దాని తీవ్రత 5.1గా నమోదయింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కానీ జరగలేదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఈ రోజు తెల్లవారుజాము 5.45 గంటలకు అప్పర సియాంగ్ జిల్లాలోని పాంగిన్‌కు 116 కిలో మీటర్ల దూరంలో.. 11 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వివరించింది.


అయితే ఈ భూకంపానికి ముందు మూడు చిన్న ప్రకంపనలు చోటు చేసుకున్నాయని పేర్కొంది. అవి ఉదయం 3.40 గంటలకు 5 కిలోమీటర్ల లోతులో 2.8 తీవ్రతతో ఒకటి.. దీని తర్వాత 3.55 గంటలకు 3.2 తీవ్రతతో మరొకటి వచ్చిందని వివరించింది. అలాగే ఉదయం 4.34 గంటలకు 2.8 తీవ్రతో ఇంకొకటి వచ్చిందని తెలిపింది. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు.


మరోవైపు ఇదే రాష్ట్రంలోని షి యోమి జిల్లాలో బుధవారం భూకంపం సంభవించింది. ఇది 5.0 తీవ్రతతో వచ్చింది. ఈ జిల్లాకు ఈశాన్యంగా 60 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైంది. ఇక్కడ కూడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. దేశంలోని ఈశాన్య ప్రాంతం భూకంపం జోన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో తరచూ అత్యధికంగా భూ ప్రకంపనలు జరుగుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

లైంగిక దాడి కేసులో తరుణ్ తేజ్‌పాల్‌కు బాంబే హైకోర్టు షాక్

బంగారం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు..

For More National News And Telugu News

Updated Date - Aug 06 , 2026 | 01:00 PM