Share News

మెటా సంస్థపై అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం

ABN , Publish Date - Aug 06 , 2026 | 12:15 PM

మెటా సంస్థపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో తన ఖాతాను ఎందుకు నియంత్రించారని ఆయన ప్రశ్నించారు.

మెటా సంస్థపై అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం
Arvind Kejriwal

ఢిల్లీ, ఆగస్టు 06: ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటాపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో తన ఖాతాను ఎందుకు నియంత్రించారని ఆయన ప్రశ్నించారు. తన అకౌంట్ నియంత్రణపై మెటా అధికారులను ప్రశ్నిస్తే సరిగా సమాధానం ఇవ్వడం లేదని, ఈమెయిల్ పంపినా కూడా స్పందించడం లేదన్నారు. ప్రధాని మోదీ ఒత్తిళ్లకు తలగొద్దని మోటా సంస్థకు కేజ్రీవాల్ సూచించారు.


తన సోషల్ మీడియా ఖాతాను భారత్‌లో ఎందుకు నిలిపివేశారో సంస్థ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదని కేజ్రీవాల్ మండిపడ్డారు. మెటా ఇండియా కార్యాలయంలో మౌఖికంగా విచారించినా ఎలాంటి సరైన సమాధానం రాలేదని, తాము పంపిన ఈమెయిల్స్‌కు సాధారణ రసీదులు మాత్రమే వస్తున్నాయని ఆరోపించారు. ఇది చాలా చెత్త సేవ అంటూ అసహనం వ్యక్తం చేశారు.


'ప్రధాని మోదీకి ఒత్తిళ్లకు తలవంచకండి.. లేదంటే భవిష్యత్తులో దేశంలో ప్రధాని ఖాతా ఒక్కటే నడుపుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తారు' అంటూ ఆయన ఎద్దేవా చేశారు. మెటా సంస్థ తన సేవలను మరింత బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని కేజ్రీవాల్ అన్నారు. కాగా, దేశంలో మెటా సంస్థపై ప్రస్తుతం తీవ్రస్థాయిలో ప్రభుత్వ నిఘా, విచారణ కొనసాగుతున్న తరుణంలో కేజ్రీవాల్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు..

చెత్తకుప్పలో కాలిన మృతదేహం.. సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్న పోలీసులు

Updated Date - Aug 06 , 2026 | 12:32 PM