Share News

తమిళనాడులో మళ్లీ 'తమిళ్ తాయ్ వాళ్తు' వివాదం.. గవర్నర్‌కు 21 మంది ఎంపీల లేఖ

ABN , Publish Date - Aug 06 , 2026 | 12:52 PM

తమిళనాడులో రాష్ట్ర గీతమైన 'తమిళ్ తాయ్ వాళ్తు' ఆలాపన ప్రొటోకాల్ మరోసారి రాజకీయ వివాదానికి దారితీసింది. తిరునెల్వేలిలోని మనోన్మణీయం సుందరనార్ యూనివర్సిటీ కాన్వకేషన్‌లో రాష్ట్ర గీతాన్ని మూడో స్థానంలో ఆలపించడంపై 21 మంది తమిళనాడు ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ గవర్నర్ ఆర్‌.ఎన్. రవికి లేఖ రాశారు.

తమిళనాడులో మళ్లీ 'తమిళ్ తాయ్ వాళ్తు' వివాదం.. గవర్నర్‌కు 21 మంది ఎంపీల లేఖ
Tamil Thai Valthu

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులో రాష్ట్ర గీతమైన 'తమిళ్ తాయ్ వాళ్తు' ఆలాపన ప్రొటోకాల్ మరోసారి రాజకీయ వివాదానికి దారితీసింది. తిరునెల్వేలిలో జరిగిన మనోన్మణీయం సుందరనార్ యూనివర్సిటీ 33వ కాన్వకేషన్‌లో ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగిందని ఎంపీలు ఆరోపించారు. కార్యక్రమంలో ముందుగా 'వందే మాతరం', అనంతరం జాతీయ గీతం, ఆ తర్వాత మూడో స్థానంలో 'తమిళ్ తాయ్ వాళ్తు' ఆలపించడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర గీతాన్ని ఈ విధంగా మూడో స్థానంలో ఉంచడం తమిళ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా.. ఆ గీత రచయిత సుందరనార్‌ను కూడా అవమానించడమేనని లేఖలో పేర్కొన్నారు.


ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం, ఎంపీ కార్తి చిదంబరం, చిరుతైగల్ కచ్చి నేత తిరుమావలవన్‌తో పాటు మొత్తం 21 మంది ఎంపీలు గవర్నర్‌కు సంయుక్తంగా లేఖ రాశారు. గత ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం.. ప్రభుత్వ, విశ్వవిద్యాలయ కార్యక్రమాల్లో ప్రారంభంలో 'తమిళ్ తాయ్ వాళ్తు', ముగింపులో జాతీయ గీతం ఆలపించాలని వారు డిమాండ్ చేశారు. వరుసగా మూడోసారి ప్రొటోకాల్‌లో మార్పులు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంటూ, భవిష్యత్తులో ఇలాంటి వివాదాలకు తావులేకుండా రాజ్‌భవన్ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి...

నీట్ శిక్షణ పొందుతున్న హైదరాబాద్ వాసి బలవన్మరణం

ఏపీ కేబినెట్ ముందుకు 30కి పైగా అజెండా అంశాలు..

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 06 , 2026 | 01:20 PM