రాయలసీమ లిఫ్ట్‌పై జగన్‌కు కాల్వ శ్రీనివాసులు స్ట్రాంగ్ కౌంటర్
ABN , Publish Date - Nov 27 , 2026 | 03:41 PM
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ‘ఎక్స్’లో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన పోస్ట్‌కు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అనంతపురం, నవంబర్ 27: రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ‘ఎక్స్’లో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన పోస్ట్‌కు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీమ అభివృద్ధి, సీమలోని ప్రాజెక్టులకు అడ్డు పడింది జగనే అంటూ మండిపడ్డారు. జగన్ రెడ్డికి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారంటూ హరీశ్ రావు చేసిన కామెంట్లను ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు గుర్తుచేశారు. జగన్ హయాంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోయిందని విమర్శించారు. స్టే వచ్చిన తరువాత మూడున్నరేళ్ల పాటు అధికారంలో ఉన్నా జగన్ కనీసం అప్పీల్ కూడా చేయలేదన్నారు.
తన రాజకీయ పెద్దన్నగా భావించిన కేసీఆర్ వార్నింగ్ ఇస్తే రాయలసీమ లిఫ్ట్ పనులను జగన్ రెడ్డి ఆపేశారని కాల్వ తెలిపారు. ఈ విషయాన్ని తాము చెప్పడం లేదని... హరీశ్ రావు చెప్పారన్నారు. 854 అడుగుల నుంచి నీరు తీసుకోవాలనే అంశాన్ని చంద్రబాబు ఎప్పుడో తిరగరాశారని అన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 798 అడుగుల నుంచే నీటిని తీసుకునే అవకాశం ఉన్న ముచ్చుమర్రి ప్రాజెక్టును జగన్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. హంద్రీ నీవా కాల్వ వెడల్పు పనులను జగన్ పట్టించుకోలేదన్నారు. హంద్రీ నీవా ప్రాజెక్టు కరెంట్ బిల్లులు పెండింగ్‌లో పెట్టిన దుర్మార్గుడు జగన్ అంటూ ఫైర్ అయ్యారు.
హంద్రీ నీవా కాల్వలను నిర్వీర్యం చేసి అనంతపురం, కర్నూల్ జిల్లాలోని ప్రాంతాలకు జగన్ రెడ్డి అన్యాయం చేశారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. హంద్రీనీవా కాల్వలకు ఒక్క ఏడాదిలో రూ.3 వేల కోట్లు ఖర్చు పెట్టిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. రాయలసీమ చరిత్రను తిరగరాస్తూ... అభివృద్ధికి బాటలు వేస్తున్న అసలు సిసలైన సీమ బిడ్డ చంద్రబాబు అని అన్నారు. సీమలో పుట్టినందుకు చంద్రబాబు సీమ రుణం తీర్చుకుంటున్నారని కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ పోలీస్ శాఖలో 1,534 ఉద్యోగాలకు నోటిఫికేషన్
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కూటమికి 74 శాతం ఓట్లు: పల్లా శ్రీనివాసరావు
Read Latest AP News And Telugu News