Share News

డిసెంబర్‌లోగా డీలిమిటేషన్ బిల్లు పాస్ కాకపోతే.. జనాభా ఆధారంగానే సీట్ల పెంపు: ఎంపీ లక్ష్మణ్

ABN , Publish Date - Nov 27 , 2026 | 03:15 PM

నషా ముక్త్ భారత్ అనేది ప్రభుత్వాలే కాదు పౌర సమాజం అనుకుంటేనే సాధ్యమవుతుందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. గత పదిహేను ఆదివారాల నుంచి నగరంలోని అనేక ప్రాంతాల్లో సైకిల్ రైడ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.

డిసెంబర్‌లోగా డీలిమిటేషన్ బిల్లు పాస్ కాకపోతే.. జనాభా ఆధారంగానే సీట్ల పెంపు: ఎంపీ లక్ష్మణ్
MP Laxman

హైదరాబాద్, నవంబర్ 27: నషా ముక్త్ భారత్ అనేది ప్రభుత్వాలే కాదు పౌర సమాజం అనుకుంటేనే సాధ్యమవుతుందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఈరోజు మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. గత పదిహేను ఆదివారాల నుంచి నగరంలోని అనేక ప్రాంతాల్లో సైకిల్ రైడ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో విద్యార్థులకు డ్రగ్‌పై అవగాహన కల్పించేందుకు సెమినార్స్ నిర్వహిస్తామన్నారు. పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. తాను చేసే సైకిల్ రైడ్‌లో ఈగల్ టీమ్ పాల్గొంటుందన్నారు. దేశ భద్రతకు డ్రగ్ ముప్పు తీసుకువస్తుందని చెప్పుకొచ్చారు. ఈ నెల 29న వెయ్యి సైకిళ్లతో ఐమ్యాక్స్ నుంచి నెక్లెస్ రోడ్డులో సైకిల్ రైడ్ నిర్వహిస్తామని తెలిపారు.


జనగాం, నర్సంపేటలో కూడా త్వరలో నషా ముక్తూ భారత్‌లో భాగంగా సైకిల్ రైడ్ చేస్తామని ఎంపీ అన్నారు. భవిష్యత్తులో ఉత్తరాది ప్రజలు.. జనాభాకు అనుగుణంగా డీలిమిటేషన్ చేయమని ఆందోళన ప్రారంభిస్తే పరిస్థితి ఏంటిని ప్రశ్నించారు. దక్షిణాది, ఉత్తరాది అంటూ తారతమ్యాలు సృష్టిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి ఏంటి.. ఒక్కో రాష్ట్రానికి ఒకే ఎంపీ ఉన్న పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు. డిసెంబర్ వరకు డీలిమిటేషన్ బిల్లు పాస్ కాకపోతే.. తరువాత జనాభాకు అనుగుణంగా చేయాల్సి వస్తుందని అన్నారు.


జీడీపీ ఆధారంగా సీట్లు పెంచాలని రేవంత్ రెడ్డి కోరుతున్నారని ఎంపీ అన్నారు. అయితే జీడీపీ ప్రతి సంవత్సరం మారుతుందని.. ఎంపీ సీట్లు కూడా ప్రతి సంవత్సరం పెంచడం, తగ్గించడం సాధ్యమా అని నిలదీశారు. డీలిమిటేషన్ ప్రతి పదేళ్లకు ఒకసారి జరుగుతుందన్నారు. సీట్లు పెరిగితే ఎస్సీ, ఎస్టీల సీట్లు పెరగవా.. చట్టసభల్లో వాళ్ల గొంతు పెరగదా అని ప్రశ్నించారు. మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు, మమతా బెనర్జీ ఎన్నికల్లో ఓడిపోయారని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్ ఫిష్ మార్కెట్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు.. కుళ్లిన చేపల స్వాధీనం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 27 , 2026 | 03:43 PM