Share News

హైదరాబాద్ ఫిష్ మార్కెట్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు.. కుళ్లిన చేపల స్వాధీనం

ABN , Publish Date - Nov 27 , 2026 | 01:18 PM

హైదరాబాద్‌లోని కవాడిగూడ రాంనగర్ చేపల మార్కెట్‌లో ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఫుడ్‌సేఫ్టీ, వెటర్నరీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన సోదాల్లో కుళ్లిన చేపలు బయటపడ్డాయి.

హైదరాబాద్ ఫిష్ మార్కెట్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు.. కుళ్లిన చేపల స్వాధీనం
Hyderabad Fish Market

హైదరాబాద్, నవంబర్ 27: నగరంలోని కవాడిగూడ రాంనగర్ చేపల మార్కెట్‌లో ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఫుడ్‌సేఫ్టీ, వెటర్నరీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన సోదాల్లో కుళ్లిన చేపలు బయటపడ్డాయి. దుకాణాల్లో నిల్వ ఉంచిన కుళ్లిన చేపలను గుర్తించిన అధికారులు... అక్కడికక్కడే స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారుల వద్ద కేవలం ట్రేడ్ లైసెన్సులు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. తప్పనిసరిగా ఉండాల్సిన FSSAI ఫుడ్‌సేఫ్టీ లైసెన్స్ లేదని అధికారులు తేల్చారు. కుళ్లిన చేపలు విక్రయించే వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి చేపల వ్యాపారి తప్పనిసరిగా ఫుడ్‌సేఫ్టీ లైసెన్స్ తీసుకోవాలని అధికారులు ఆదేశాలు చేశారు.


సోదాలపై ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ మనోజ్ ఏబీఎన్‌‌తో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో చేపల మార్కెట్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. బేగంబజార్, రామ్‌నగర్ చేపల మార్కెట్లలో తనిఖీలు చేస్తున్నామని.. చేపల నాణ్యత, నిల్వ విధానాలపై ప్రత్యేక పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు. చాలామందికి ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ లేదని.. లేని వారికి నోటీసులు ఇచ్చామన్నారు. చేపలను తాజాగా ఉంచేందుకు రసాయనాలు వాడుతున్నారా అనే కోణంలో తనిఖీలు చేశామని వెల్లడించారు. ఫార్మాలిన్ వినియోగంపై చాపలను ఎస్ఎఫ్ఎల్ ద్వారా టెస్ట్ చేశామని.. చేపల విక్రయ కేంద్రాల్లో అపరిశుభ్రతను గుర్తించామని అన్నారు. కూలిన చేపలను గుర్తించి ధ్వంసం చేయడానికి పంపించామని తెలిపారు.


ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని వ్యాపారులపై చర్యలకు సిద్ధం అయినట్లు మనోజ్ అన్నారు. నోటీసులు ఇచ్చామని.. నిర్ణీత గడువులోపు హైజెనిక్‌గా చాపల అమ్మకాలు చేపట్టాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం లైసెన్సులు తీసుకోవాలన్నారు. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా టీజీ సేఫ్ ఫుడ్ అధికారుల స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు లైవ్ చేపలను మాత్రమే తీసుకోవాలని.. సజీవంగా ఉన్న చేపలను గమనించి తీసుకోవాలని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ మనోజ్ సూచించారు.


ఇవి కూడా చదవండి...

వారం రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా ఒడ్డుకు చేరిన కాకినాడ మత్స్యకారులు

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ బాధ్యతల స్వీకరణ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 27 , 2026 | 01:22 PM