ఎన్టీఆర్ జిల్లాలో మళ్లీ పెద్దపులి జాడ.. మూడు రోజుల తర్వాత ట్రాకర్ సిగ్నల్స్
ABN , Publish Date - Nov 27 , 2026 | 10:36 AM
ఎన్టీఆర్ జిల్లాలో కొద్దిరోజులుగా పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. దాదాపు మూడు రోజుల తర్వాత పెద్దపులి కదలికల సంకేతాలు మళ్లీ అందాయి.
ఎన్టీఆర్ జిల్లా, నవంబర్ 27: జిల్లాలో పెద్దపులి సంచారం మళ్లీ కలకలం రేపుతోంది. మూడు రోజులుగా అందుబాటులో లేని పెద్దపులి కదలికల సంకేతాలు తాజాగా మళ్లీ అందాయి. పులికి అమర్చిన ట్రాకర్ ద్వారా సిగ్నల్స్ రావడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక టైగర్ ఎక్స్‌ప్లోరర్ ఆపరేషన్ ఏడో రోజుకు చేరుకుంది. గత అర్ధరాత్రి కనుమూరు ఫారెస్ట్‌లోనే పెద్దపులి సంచరించినట్లు అధికారులు గుర్తించారు.
మూడు రోజులుగా ట్రాకర్ సిగ్నల్స్ అందకపోవడంతో ఆందోళన వ్యక్తం చేసిన అధికారులు.. తాజాగా సంకేతాలు అందడంతో ఊరట చెందారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు నిఘా పెట్టాయి. మరోవైపు పెద్దపులి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పెద్దపులిని సురక్షితంగా బంధించేందుకు అటవీశాఖ అధికారుల నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు. పులి కదలికల నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో ఏ.కుమార్ సూచించారు. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళొద్దని, రైతులు, పశువులకాపరులు జాగ్రత్తగా ఉండాలని కుమార్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
పంచాయతీ ఎన్నికలపై నారా లోకేశ్ టెలీకాన్ఫరెన్స్.. నేతలకు కీలక ఆదేశాలు
వారం రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా ఒడ్డుకు చేరిన కాకినాడ మత్స్యకారులు
Read Latest AP News And Telugu News