వారం రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా ఒడ్డుకు చేరిన కాకినాడ మత్స్యకారులు
ABN , Publish Date - Nov 27 , 2026 | 10:16 AM
చేపలవేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన కాకినాడ మత్స్యకారులు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. గత అర్ధరాత్రి మత్స్యకారులు ఉప్పాడ తీరానికి చేరుకున్నారు.
అమరావతి, నవంబర్ 27: చేపలవేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన కాకినాడ మత్స్యకారులు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. గత అర్ధరాత్రి మత్స్యకారులు ఉప్పాడ తీరానికి చేరుకున్నారు. దీంతో వారం రోజులుగా ఆందోళనలో ఉన్న మత్స్యకార కుటుంబాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఒడ్డున చేరుకున్న మత్స్యకారులను కాకినాడ జిల్లా అధికారులు, కోస్ట్ గార్డ్ అధికారులు కలిసి పరామర్శించారు. సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుల కోసం అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో వారం రోజులుగా పెద్ద ఎత్తున మత్స్యకారుల కోసం గాలించారు.
వివిధ శాఖల సమన్వయం, నిరంతర పర్యవేక్షణతో ఎట్టకేలకు గల్లంతైన వారి ఆచూకీని అధికారులు కనిపెట్టారు. గల్లంతైన వారు ఒడ్డుకు చేరుకునేంత వరకు అధికార యంత్రాంగం నిరంతరం గాలింపు చర్యలు కొనసాగించారు. తాము చేపడుతున్న గాలింపు చర్యలను ఎప్పటికప్పుడు మత్స్యకారుల కుటుంబ సభ్యులకు అధికారులు తెలియజేశారు. తమ వారు క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచి ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబుకు మత్స్యకార కుటుంబాలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి...
పంచాయతీ ఎన్నికలపై నారా లోకేశ్ టెలీకాన్ఫరెన్స్.. నేతలకు కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News