ప్రతి పౌరుడు ఓటేయాలి: పవన్
ABN , Publish Date - Nov 27 , 2026 | 06:42 AM
మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మంగళగిరి సిటీ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి కాలనీలో ఉన్న 34వ నంబరు పోలింగ్ కేంద్రంలో గురువారం ఉదయం 11:30 గంటల సమయంలో ఆయన ఓటు వేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరిస్తూ సామాన్య ఓటర్లతో కలిసి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బాధ్యత కలిగిన ప్రతిపౌరుడు ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ వార్తలనూ చదవండి:
2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు
బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా