Share News

హైదరాబాద్‌లో అర్ధరాత్రి దంచికొట్టిన వర్షం

ABN , Publish Date - Nov 27 , 2026 | 08:00 AM

హైదరాబాద్‌లో గురువారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు వర్షం ప్రారంభమైంది. మూడు గంటల పాటు ఏకధాటిగా కురిసింది.

హైదరాబాద్‌లో అర్ధరాత్రి దంచికొట్టిన వర్షం

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌లో గురువారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు వర్షం ప్రారంభమైంది. మూడు గంటల పాటు ఏకధాటిగా కురిసింది. బోడుప్పల్, పీర్జాదిగూడ, ఉప్పల్, సికింద్రాబాద్, ఎర్రగడ్డ, బోయిన్ పల్లి, మారేడుపల్లి, రాణిగంజ్, ఎంజీ రోడ్, బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, యూసుఫ్ గూడ, పంజాగుట్ట, అమీర్ పేట, బోరబండ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతోపాటు గచ్చిబౌలి, టోలిచౌకి, మేడ్చల్‌లోనూ వర్షం కురిసింది.


ఏకధాటిగా వర్షం కురవడంతో నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. కొన్ని ప్రాంతాలు చెరువులను తలపించాయి. వర్షపు నీరు రోడ్లపైకి రావడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. 4.30 గంటల తర్వాత వర్షం కాస్త ఉపశమించింది. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.


5 జిల్లాలకు ఎల్లో అలర్ట్

రాష్ట్రంలోని 5 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో శుక్రవారం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షం కురవవచ్చని పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి...

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్

Updated Date - Nov 27 , 2026 | 08:00 AM