మూసాపేట, కోకాపేట భూముల ఈ-వేలం నేడు
ABN , Publish Date - Nov 27 , 2026 | 07:46 AM
మూసాపేటలోని 3.15 ఎకరాలను, కోకాపేటలోని నియో పోలీసు లేఅవుట్‌లోని 4.59 ఎకరాలను శుక్రవారం ఈ-వేలం వేయనున్నారు.
హైదరాబాద్ సిటీ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మూసాపేటలోని 3.15 ఎకరాలను, కోకాపేటలోని నియో పోలీసు లేఅవుట్‌లోని 4.59 ఎకరాలను శుక్రవారం ఈ-వేలం వేయనున్నారు. కూకట్‌పల్లి మండలం మూసాపేట రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబరు 121/పీ నుంచి 141, 146, 147, 155 నుంచి 157లలో ఉన్న 3.15ఎకరాలను పెద్ద పార్సిల్‌గా నిర్ణయించారు. మల్టీపర్పస్ జోన్‌లో ఉన్న ఈ భూమి హైదరాబాద్ - ముంబై జాతీయ రహదారి 65కు ఆనుకుని ఉంటుంది.
అదేవిధంగా గండిపేట మండలం కోకాపేట గ్రామంలోని సర్వే నెంబరు 239, 240లలోని 4.59 ఎకరాలను పెద్ద పార్సిల్‌గా నిర్ణయించారు. ఈ భూములకు ఎకరా కనీస ధర రూ.99 కోట్లుగా హెచ్‌ఎండీఏ అధికారులు పేర్కొంటున్నారు. భూములను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కలిగిన వారు రూ.5కోట్ల మేర ముందస్తు డిపాజిట్ చేయడంతో పాటు ఈ-వేలంలో ఎకరాకు రూ.25లక్షల చొప్పున కనీస బిడ్ చేస్తూ అధిక ధరకు దక్కించుకోవాల్సి ఉంటుంది.
కోకాపేట భూములను శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మూసాపేట భూములను మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ ఈ కామర్స్ ఆధ్వర్యంలో ఈ-వేలం వేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్