చెట్టును ఢీకొట్టిన శిక్షణ విమానం
ABN , Publish Date - Nov 27 , 2026 | 06:31 AM
శిక్షణ విమానం ప్రమాదవశాత్తు చెట్టును ఢీ కొట్టిన సంఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి
ట్రైనీ పైలెట్, ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్‌కు గాయాలు
కార్వాన్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): శిక్షణ విమానం ప్రమాదవశాత్తు చెట్టును ఢీ కొట్టిన సంఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ పరిధిలో గురువారం ఈ ప్రమాదం జరిగింది. సెన్నా-152 రకం శిక్షణ విమానం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ల్యాండ్ అవుతుండగా సాంకేతిక లోపం తలెత్తి, అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టినట్లు తెలిసింది. ప్రమాద సమయంలో అందులో ఉన్న ట్రైనీ ఫైలట్ అనుష్క బాజ్‌పాయ్ (23), ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ కెప్టెన్ ఎం.ప్రశాంత్ కుమార్ (30) విమానం నుంచి దూకడంతో వారి తలకు గాయాలయ్యాయి. గమనించిన సైనిక అధికారులు గాయపడిన వారిని వెంటనే లంగర్‌హాజ్‌లోని రెనోవా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.