రాష్ట్ర ఆధీనంలోనే ఈఎస్ఐ ఆస్పత్రులుండాలి
ABN , Publish Date - Nov 27 , 2026 | 06:37 AM
కార్మికుల ఆరోగ్య భద్రతకు కీలకమైన ఈఎస్ఐ ఆస్పత్రుల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ( ఈఎస్ఐ ) డిమాండ్ చేసింది
సీఎంకు ఈఎస్ఐ ప్రభుత్వ వైద్యుల సంఘం వినతి
హైదరాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): కార్మికుల ఆరోగ్య భద్రతకు కీలకమైన ఈఎస్ఐ ఆస్పత్రుల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ( ఈఎస్ఐ ) డిమాండ్ చేసింది. 70 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కొనసాగుతున్న ఈఎస్ఐ వైద్య వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి సంఘం ప్రతినిధులు గురువారం వినతిపత్రాన్ని సమర్పించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనిఈఎస్ఐసీ ప్రతిపాదిస్తున్న సొసైటీ విధానాన్ని నిలిపివేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రామచంద్రాపురం, నాచారం ఈఎస్ఐ ఆస్పత్రులను ఈఎస్ఐసీ తన పరిధిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.