Share News

ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం

ABN , Publish Date - Nov 27 , 2026 | 09:00 AM

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం
khairatabad ghmc

హైదరాబాద్, నవంబరు 27: నగరంలోని ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ప్రమాదవశాత్తు భారీ ప్రమాదం చోటుచేసుకుంది. 2వ అంతస్తులోని చెక్ సెక్షన్‌లో భారీగా మంటల చెలరేగడంతో పలు కీలకమైన డాక్యూమెంట్లు దగ్ధం అయినట్లు తెలుస్తోంది. కాగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Updated Date - Nov 27 , 2026 | 09:05 AM