విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Nov 27 , 2026 | 10:42 AM
విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేసిన అనంతరం తన ఛాంబర్‌లో అడుగు పెట్టారు.
విజయవాడ, నవంబర్ 27: విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు(శుక్రవారం) ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేసిన అనంతరం తన ఛాంబర్‌లో అడుగు పెట్టారు. శానిటేషన్, హెల్త్ సమస్యల పరిష్కారం కోసం డ్రైవ్ చేపట్టేలా తొలి ఫైల్‌పై రాధాకృష్ణ సంతకం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. విజయవాడ నగర మేయర్‌గా ఇవాళ బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని, వన్ టౌన్ ఇన్‌ఛార్జ్ బుద్దా వెంకన్న, కార్పొరేటర్లు అందరి సమక్షంలో బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు.
ప్రజలు తమ మీద నమ్మకంతో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా తమ పనితీరు ఉంటుందని మేయర్ వెల్లడించారు. ప్రజలందరి నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టేలా పనిచేస్తామని స్పష్టం చేశారు. విజయవాడ నగర సమస్యల మీద ప్రతి ఒక్కరూ దృష్టి సాధిస్తామని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, బోండా ఉమామహేశ్వర రావు, సుజనా చౌదరితో సమన్వయ పరుచుకుంటూ కార్పొరేటర్లందరితో కలిసి విజయవాడను ఎక్కడా సమస్యలు లేకుండా ఒక పరిష్కార దిశగా తీసుకెళ్తామని అన్నారు. శానిటేషన్, హెల్త్ మీద తొలి సంతకం పెట్టానని.. 30 రోజు డ్రైవ్ ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. అధికారులతో రివ్యూ మీటింగ్ తర్వాత దాని పూర్తి కార్యాచరణ తెలియజేయనున్నట్లు మేయర్ వంగవీటి రాధాకృష్ణ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
పంచాయతీ ఎన్నికలపై నారా లోకేశ్ టెలీకాన్ఫరెన్స్.. నేతలకు కీలక ఆదేశాలు
వారం రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా ఒడ్డుకు చేరిన కాకినాడ మత్స్యకారులు
Read Latest AP News And Telugu News