Share News

ఏపీ పోలీస్ శాఖలో 1,534 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ABN , Publish Date - Nov 27 , 2026 | 01:30 PM

ఏపీ పోలీసు శాఖలో 1,534 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 378 ఎస్ఐ, 1,156 కానిస్టేబుల్ స్థాయి పోస్టుల భర్తీకి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఏపీ పోలీస్ శాఖలో 1,534 ఉద్యోగాలకు నోటిఫికేషన్
AP Police

అమరావతి, నవంబర్ 27: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్ర పోలీసు శాఖలో 1,534 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 378 ఎస్ఐ, 1,156 కానిస్టేబుల్ స్థాయి పోస్టుల భర్తీకి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 378 ఎస్ఐ పోస్టులలో 253 సివిల్ ఎస్ఐ, 116 ఏఆర్ రిజర్వ్ ఎస్ఐ, 9 ఎస్‌పీఎఫ్ ఎస్ఐ ఖాళీలు ఉన్నాయి. 1,156 కానిస్టేబుల్ విభాగంలో 542 సివిల్, 285 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు ఫైర్‌మెన్ 158, పురుష వార్డర్లు 150, మహిళా వార్డర్ల విభాగంలో 21 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.


నవంబర్ 27 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానుండగా.. డిసెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు చివరి గడువుగా విధించారు. 2027 జనవరి 31న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షను నిర్వహించనున్నారు. 2027 ఫిబ్రవరి 28న ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలో ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 నిర్వహించనున్నారు. అలాగే ఎస్ఐ (PTO, కమ్యూనికేషన్), సైంటిఫిక్ అసిస్టెంట్లు, డ్రైవర్, మెకానిక్ పోస్టుల భర్తీకి సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే వెల్లడిస్తామన్న బోర్డు తెలిపింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు, సిలబస్, అర్హతల కోసం అధికారిక వెబ్‌సైట్ slprb.ap.gov.in చూడాలని అభ్యర్థులకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సూచించింది.


ఇవి కూడా చదవండి...

వారం రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా ఒడ్డుకు చేరిన కాకినాడ మత్స్యకారులు

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ బాధ్యతల స్వీకరణ

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 27 , 2026 | 01:35 PM