Share News

స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రెగ్యులర్‌గా మార్పు

ABN , Publish Date - Apr 30 , 2026 | 10:38 AM

ప్రయాణికుల రద్దీ నియంత్రణ కోసం నడుపుతున్న మైసూరు-కాకినాడటౌన్‌ స్పెషల్‌ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (07033/34)ను ఇకపై రెగ్యులర్‌ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‏గా ప్రమోట్‌ చేశారు.

స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రెగ్యులర్‌గా మార్పు
Mysuru-Kakinada Express

గుంతకల్లు(అనంతపురం): ప్రయాణికుల రద్దీ నియంత్రణ కోసం నడుపుతున్న మైసూరు-కాకినాడటౌన్‌ స్పెషల్‌ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (07033/34)ను ఇకపై రెగ్యులర్‌ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‏గా ప్రమోట్‌ చేశారు. కాకినాడటౌన్‌-మైసూరు (నం. 17289) బైవీక్లీ రెగ్యులర్‌ ఎక్స్‌ప్రెస్‏ను మే 1వ తేదీ నుంచి సోమ, శుక్రవారాల్లో వారానికి రెండురోజులు నడపనున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ఈ రైలు కాకినాడ టౌన్‌లో ఉదయం 9 గంటలకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 4 గంటలకు మైసూరుకు చేరుకుంటుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (17290) రైలు మే 2వ తేదీ నుంచి మంగళ, శనివారాలలో మైసూరులో సాయంత్రం 5.05 గంటలకు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 11-30 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుందన్నారు.


pandu2.2.jpgఈ రైలు మాండ్యా, చెన్నపట్న, రామనగరం, కెంగేరి, బెంగళూరు, బెంగళూరు కంటోన్మెంటు, యల్హంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, ఆదోని, యాద్గిర్‌, సేడం, వికారాబాద్‌, లింగంపల్లి, బేగంపేట, సికిందాబ్రాద్‌, నల్లగొండ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, అకివీడు, భీమవరం టౌన్‌, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట మీదుగా గమ్యస్థానానికి చేరుకుంటుందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..

ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే!

Read Latest Telangana News and National News

Updated Date - Apr 30 , 2026 | 10:38 AM