ఇరాన్‌కు ఊపిరాడడం లేదు.. దిగ్బంధనం కొనసాగుతుంది: అమెరికా అధ్యక్షుడు
ABN , Publish Date - Apr 30 , 2026 | 08:26 AM
దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్న ఘర్షణను ముగించాలనే ఇరాన్ ప్రతిపాదనను అంగీకరించాలంటే తమ షరతులకు ఒప్పుకోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వదులుకునే వరకు ఆ దేశంతో శాంతి ఒప్పందం కుదరదని ఆయన తెలిపారు.
దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్న ఘర్షణను ముగించాలనే ఇరాన్ ప్రతిపాదనను అంగీకరించాలంటే తమ షరతులకు ఒప్పుకోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వదులుకునే వరకు ఆ దేశంతో శాంతి ఒప్పందం కుదరదని ఆయన తెలిపారు. అప్పటివరకు ఇరాన్‌పై అమెరికా నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని హెచ్చరించారు (Trump Iran blockade).
బుధవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్.. ఇరాన్ యుద్ధం గురించి మాట్లాడారు. 'బాంబు దాడి కంటే దిగ్బంధనమే ఎక్కువ ప్రభావవంతంగా ఉంది. వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారి పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోంది. వారు రాజీ పడాలనుకుంటున్నారు. నేను దిగ్బంధనాన్ని కొనసాగించడం వారికి ఇష్టం లేదు. ఎత్తివేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వారు అణ్వాయుధాన్ని కలిగి ఉండడానికి వీల్లేదు' అని ట్రంప్ స్పష్టం చేశారు (Iran nuclear deal).
కాగా, శాంతి ఒప్పందానికి అంగీకరించేలా ట్రంప్ చేస్తున్న బెదిరింపులపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది (US Iran tensions). అమెరికా మోసపూరిత ప్రణాళిక ఓడిపోతుందని, దిగ్బంధనం ద్వారా దేశంలో అంతర్గత కలహాలను సృష్టించాలనే ట్రంప్ ప్రణాళిక ఎన్నటికీ సఫలం కాదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ పేర్కొన్నారు. ఏదేమైనా అమెరికా-ఇరాన్ మధ్య ప్రస్తుతానికి శాంతి చర్చలు జరగడం లేదు.
ఇవి కూడా చదవండి..
బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..
రష్యాలో మరో ఆయిల్ కేంద్రంపై దాడి.. డ్రోన్ శక్తిని చూపిస్తున్న ఉక్రెయిన్..