అనంతపురం జిల్లాలో ట్రాన్స్‌జెండర్ సోదరుడు దారుణ హత్య
ABN , Publish Date - Sep 16 , 2026 | 07:47 AM
అనంతపురం జిల్లా గుంతకల్లులో ట్రాన్స్‌జెండర్ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. వీరి వివాదం తీవ్ర విషాదానికి దారి తీసింది. ఈ ఘటనలో ట్రాన్స్‌జెండర్ సోదరుడు దారుణ హత్యకు గురయ్యారు.
అనంతపురం జిల్లా, సెప్టెంబర్ 16 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా గుంతకల్లులో ట్రాన్స్‌జెండర్ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. వీరి వివాదం తీవ్ర విషాదానికి దారి తీసింది. ఈ ఘటనలో ట్రాన్స్‌జెండర్ సోదరుడు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు దారితీసిన పరిస్థితుల గురించి పోలీసులు ఆరా తీశారు. ప్రాథమికంగా ట్రాన్స్‌జెండర్ల మధ్య నెలకొన్న పోరే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ఈ హత్యకు సంబంధించి నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు ముందు ఏం జరిగింది.?, మృతుడితో ఎవరికైనా వివాదాలు ఉన్నాయా.?, ఈ హత్యలో ఎంతమంది పాల్గొన్నారు.? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉద్యోగ నియామకాల వయోపరిమితి పెంపు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు
మహాత్మాగాంధీ మునిమనవడు కిదార్ రామ్ గోబిన్‌తో అయ్యన్నపాత్రుడు భేటీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News