సత్యసాయి జిల్లాలో సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారు
ABN , Publish Date - May 14 , 2026 | 12:20 PM
సత్యసాయి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన షెడ్యూల్‌ను అధికారులు గురువారం విడుదల చేశారు.
పుట్టపర్తి(సత్యసాయి): సత్యసాయి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన షెడ్యూల్‌ను అధికారులు గురువారం విడుదల చేశారు. ఉండవల్లి నుంచి శుక్రవారం ఉదయం 8.15 గంటలకు ఆయన హెలికాప్టర్‌లో బయలుదేరి, పుట్టపర్తి విమానాశ్రయానికి ఉదయం 9.45 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 10.10 గంటలకు పుట్టపర్తికి చేరుకుంటారు. నిర్దేశిత కార్యక్రమం జరిగే ప్రాంతానికి ఉదయం 10.15 గంటలకు చేరుకుంటారు.
యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ శంకుస్థాన కార్యక్రమంలో ఉదయం 10.15 నుంచి 12.30 గంటల వరకు పాల్గొంటారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి శంకుస్థాపన చేస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో పుట్టపర్తికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.35 గంటలకు పుట్టపర్తి నుంచి విమానాశ్రయానికి రోడ్డు మార్గాన వెళ్లి, 12.50 గంటలకు హెలికాప్టర్‌లో ఉండవల్లికి బయలుదేరుతారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రయ్.. రయ్.. రైళ్లు.. ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు
రక్తపోటు నుంచి బరువు వరకు.. మందార టీతో ఎన్నో లాభాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News