Share News

పీఎంజే జ్యువెలరీ షాపులో దోపిడీ.. సుభోద్ గ్యాంగ్ పనే: సీపీ

ABN , Publish Date - May 14 , 2026 | 11:55 AM

నగరంలోని పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు జరిపి.. నగలు దోపిడీకి పాల్పడింది సుభోద్ సింగ్ గ్యాంగ్ అని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జరిగాసింగ్ అని చెప్పారు.

పీఎంజే జ్యువెలరీ షాపులో దోపిడీ.. సుభోద్ గ్యాంగ్ పనే: సీపీ
Karimnagar Police Commissioner

కరీంనగర్, మే14: నగరంలోని పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు జరిపి.. నగలు దోపిడీకి పాల్పడింది సుభోద్ సింగ్ గ్యాంగ్ అని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జరిగాసింగ్ అని చెప్పారు. గురువారం కరీంనగర్‌లో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ గౌస్ ఆలం విలేకర్లతో మాట్లాడుతూ ఈ దోపిడీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. మొత్తం 161.4 తులాల బంగారు ఆభరణాలను ఈ గ్యాంగ్ దొంగతనం చేసిందని వివరించారు.


మొత్తం వీటి విలువ రూ. 82 లక్షలు ఉంటుందన్నారు. బిహార్‌కు చెందిన సుభోద్ గ్యాంగ్‌‌కి.. గోల్డెన్ తీఫ్‌గా పేరుందని గుర్తు చేశారు. పీఎంజే జ్యువెలరీ షాపులో ముందుగా రెక్కీ నిర్వహించి.. అనంతరం ఈ దోపిడీని ఈ గ్యాంగ్ చేసిందన్నారు. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోని మెహతాబ్ వద్ద ఈ ముఠా సెల్ ఫోన్, సిమ్స్ కొనుగోలు చేసినట్లు తమ విచారణలో వెల్లడైందన్నారు.


ఖమ్మం, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్‌లలో బంగారు షాపులపై ఈ గ్యాంగ్ రెక్కీ నిర్వహించిందని చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జాగీరా సింగ్ సహా ప్రద్యుమన్, మెహతాబ్ ఖాన్‌లను అరెస్ట్‌ చేశామని సీపీ తెలిపారు. వీరు నకిలీ ఆధార్, నకిలీ బైక్ నెంబర్లు, నకిలీ పేర్లతో తిరుగుతూ ఈ దోపిడీలకు పాల్పడతారని సీపీ గౌస్ ఆలం వివరించారు. రెండు నెలల ముందు ఈ గ్యాంగ్ తెలంగాణకు వచ్చిందని సీపీ గౌస్ ఆలం వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కార్లు వదలి.. బస్సులు, మెట్రోల్లో ప్రయాణించండి: కేంద్రం కొత్త ఆంక్షలు

ట్యాంకర్‌‌ను ఢీ కొట్టిన బస్సు.. నలుగురు ప్రయాణికులు సజీవ దహనం

For More TG News And Telugu News

Updated Date - May 14 , 2026 | 01:16 PM