డిష్‌వాష్ లిక్విడ్‌తో పాత్రలే కాదు.. ఆభరణాలు కూడా మెరిసిపోతాయి
ABN , Publish Date - May 14 , 2026 | 11:20 AM
డిష్‌వాష్ లిక్విడ్‌ను చాలామంది కేవలం పాత్రల శుభ్రతకే ఉపయోగిస్తారు. కానీ ఇదే లిక్విడ్‌తో బట్టల మరకలు తొలగించడం నుంచి ఆభరణాలు, స్టీల్ వస్తువులు మెరిపించడం వరకు అనేక పనులు సులభంగా చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: డిష్‌వాష్ లిక్విడ్‌ను చాలామంది కేవలం పాత్రలు శుభ్రం చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కానీ దీన్ని సరైన విధంగా ఉపయోగిస్తే ఇంట్లోని మరెన్నో వస్తువులను కూడా సులభంగా శుభ్రం చేయొచ్చు. నూనె, జిడ్డును తొలగించే గుణం ఉండటంతో మొండి మరకలను కూడా ఇది సులభంగా తొలగిస్తుంది. అయితే డిష్‌వాష్ లిక్విడ్‌ను ఎక్కువ మోతాదులో ఉపయోగించకూడదు. ఎక్కువగా వాడితే సబ్బు పొర ఏర్పడి మురికి మరింతగా పేరుకునే అవకాశం ఉంటుంది.
బట్టలపై మరకలు తొలగించడానికి
బట్టలపై నూనె లేదా ఆహారపు మరకలు పడితే డిష్‌వాష్ లిక్విడ్ చాలా ఉపయోగపడుతుంది. మరక ఉన్న చోట ఒకటి లేదా రెండు చుక్కలు వేసి కొంతసేపు ఉంచి, తర్వాత సాధారణంగా ఉతికితే మరకలు తగ్గుతాయి.
వంటగదిలో జిడ్డు తొలగించడానికి
గ్యాస్ స్టవ్, కిచెన్ క్యాబినెట్లు, ఫ్రిజ్ హ్యాండిల్స్‌పై పేరుకున్న జిడ్డును తొలగించడానికి గోరువెచ్చని నీటిలో కొద్దిగా డిష్‌వాష్ లిక్విడ్ కలిపి తుడవాలి. తర్వాత తడి గుడ్డతో మళ్లీ శుభ్రం చేస్తే మెరిసిపోతాయి.
బాత్రూమ్ శుభ్రం చేయడానికి
సింక్, బాత్‌టబ్, షవర్ గ్లాస్‌లపై ఏర్పడే సబ్బు మరకలను తొలగించడంలో కూడా డిష్‌వాష్ లిక్విడ్ ఉపయోగపడుతుంది. దీంతో ఖరీదైన క్లీనర్ల అవసరం తగ్గుతుంది.
మేకప్ బ్రష్‌ల కోసం
మేకప్ బ్రష్‌లపై పేరుకునే మురికి, ఆయిల్‌ను తొలగించడానికి గోరువెచ్చని నీటిలో కొద్దిగా డిష్‌వాష్ లిక్విడ్ కలిపి బ్రష్‌లను శుభ్రం చేయొచ్చు. తర్వాత శుభ్రమైన నీటితో కడిగితే సరిపోతుంది.
ఆభరణాలు మెరిపించడానికి
బంగారం, వజ్రాల ఆభరణాలపై పేరుకునే మురికిని తొలగించడానికి కూడా డిష్‌వాష్ లిక్విడ్ ఉపయోగపడుతుంది. గోరువెచ్చని నీటిలో కొద్దిగా డిష్‌వాష్ లిక్విడ్‌ను కలిపి సున్నితంగా శుభ్రం చేస్తే ఆభరణాలు మళ్లీ మెరుస్తాయి.
స్టెయిన్‌లెస్ స్టీల్ వస్తువులకు మెరుగు
ఫ్రిజ్, మైక్రోవేవ్ వంటి స్టీల్ వస్తువులపై ఉన్న మరకలను తొలగించడానికి కూడా డిష్‌వాష్ లిక్విడ్ ఉపయోగపడుతుంది. కొద్దిగా నీటితో కలిపి తుడిస్తే అవి కొత్తలా కనిపిస్తాయి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
బంగాళదుంపలు త్వరగా ఉడకాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి
రక్తపోటు నుంచి బరువు వరకు.. మందార టీతో ఎన్నో లాభాలు
For More Latest News