6న అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
ABN , Publish Date - Apr 04 , 2026 | 01:30 PM
సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 6వ తేదీన యాడికి మండలంలో పర్యటించనున్నారు.
పెండేకల్ జలాశయానికి జలహారతి
యాడికిలో బహిరంగ సభ
అనంతపురం: సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 6వ తేదీన యాడికి మండలంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లన కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్, స్థానిక ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఇదీ షెడ్యూల్:
మధ్యాహ్నం 12:10కి వేములపాడు లోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలుకుతారు.
12:30కి యాడికి మార్కెట్ యార్డులోని ప్రజావేదికకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశం కొనసాగుతుంది. - తర్వాత అరగంటపాటు విశ్రాంతి తీసుకుంటారు.
12:40కి వేములపాడుకు చేరుకుని పెండేకల్లు రిజర్వాయర్ ప్రాంతాన్ని పరిశీలిస్తారు.
3:30 గంటలకు వేములపాడుకు చేరుకుని కార్యకర్తలతో సాయంత్రం 5:10 గంటల వరకు సమావేశం అవుతారు
5:20 గంటలకు విజయవాడకు తిరిగి బయల్దేరుతారు
ఈ వార్తలు కూడా చదవండి:
9 మంది ఓటర్ల కోసం 150 కి.మీ వెళ్లాల్సిందే
ఓటర్ల జాబితాలో పేరు చేరుస్తామంటూ ‘లింక్’లు
Read Latest Telangana News and National News