జైలు నుంచే హరినాడార్ నామినేషన్
ABN , Publish Date - Apr 04 , 2026 | 11:55 AM
స్థానిక పుళల్ కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న హరి నాడార్, ఆలంకుళం నియోజకవర్గంలో పోటీచేసేందుకు నామినేషన్ వేశారు.
చెన్నై: స్థానిక పుళల్ కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న హరి నాడార్, ఆలంకుళం నియోజకవర్గంలో పోటీచేసేందుకు నామినేషన్ వేశారు. తిరునల్వేలి జిల్లా మేల ఇలందైకుళం ప్రాంతానికి చెందిన హరి నాడార్ (45)పై 24 క్రిమినల్ కేసులున్నాయి. ఆయన ‘పంగాట్టు పడై’ అనే నాడార్ సముదాయానికి చెందినవారు. 2021 ఎన్నికల్లో, అలంకుళం నియోజకవర్గంలో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి 37,727 ఓట్లు పొందారు. ప్రస్తుతం ఒక కేసులో అరెస్టయి పుళల్ జైలులో ఉన్నారు.
జైలు అధికారుల సమక్షంలో ప్రతిజ్ఞ చేసి, ఏజెంట్ల ద్వారా ఆలంకుళంలో పోటీచేసేందుకు నామినేషన్ వేశారు. అందులో, రూ.26.76 కోట్ల చరాస్తులు, రూ.12 లక్షల విలువైన ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. 11.650 కిలోల బంగారు నగలు, రూ.17.06 కోట్ల విలువైన బంగారు కడ్డీలు ఉన్నాయి. అలాగే, 2021లో రూ.1.52 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించినట్లు తెలియజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
9 మంది ఓటర్ల కోసం 150 కి.మీ వెళ్లాల్సిందే
ఓటర్ల జాబితాలో పేరు చేరుస్తామంటూ ‘లింక్’లు
Read Latest Telangana News and National News