9 మంది ఓటర్ల కోసం 150 కి.మీ వెళ్లాల్సిందే
ABN , Publish Date - Apr 04 , 2026 | 11:39 AM
కన్నియాకుమారి జిల్లా పద్మనాభపురం నియోజకవర్గం పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రంలో 9 మంది ఓటర్లుండగా, ఎన్నికల అధికారులు సుమారు 150 కి.మీ పయనించాల్సిన పరిస్థితులన్నాయి.
చెన్నై: కన్నియాకుమారి జిల్లా పద్మనాభపురం నియోజకవర్గం పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రంలో 9 మంది ఓటర్లుండగా, ఎన్నికల అధికారులు సుమారు 150 కి.మీ పయనించాల్సిన పరిస్థితులన్నాయి. ఈ కేంద్రం పేచ్చిపారై పంచాయతీలోని మేల్‌గోదయారులో ఉంది. ఈ ప్రాంతంలోని విద్యుదుత్పత్తి కేంద్రం ప్రాంగణంలోని క్వార్టర్స్‌లో నివసిస్తున్న ఉద్యోగులే ఇక్కడ ఓటర్లు. కీల్‌గోదయారు నుంచి మేల్‌గోదయారుకు ‘వింఛ్’లో విద్యుత్ బోర్డు ఉద్యోగులు మాత్రమే వెళ్లాల్సి ఉండడంతో, నాగర్‌కోయిల్, కలక్కాడు, చేరన్‌మహాదేవి, కల్లిడైకుర్చి, మణిముత్తారు.
మాంజోలై మీదుగా చుట్టు వెళ్లాల్సి ఉంది. ఈ కారణంగా, ప్రతి ఎన్నికల్లోను అధికారులు ఈవీఎంలు పట్టుకుని సుమారు 150 కి.మీ ప్రయాణిస్తుంటారు. ఈ నెల 23వ తేది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో 9 మంది ఓటర్ల కోసం కులశేఖరం, తిరువట్టారు తాలూకా కార్యాలయాల నుంచి ఎన్నికల అధికారులు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కేబీఆర్ పార్కు చుట్టూ వన్‌వే..
Read Latest Telangana News and National News