Share News

దారుణం... వివాహితపై ఇంటి యజమాని వికృత చేష్టలు

ABN , Publish Date - Apr 04 , 2026 | 11:21 AM

తిరుపతిలో వివాహితపై ఇంటి యజమాని అత్యాచారయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఏప్రిల్ 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దారుణం... వివాహితపై ఇంటి యజమాని వికృత చేష్టలు
Tirupati News

తిరుపతి, ఏప్రిల్ 4: తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. వివాహిత మహిళపై అత్యాచారయత్నం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 2న గురువారం తెల్లవారుజామున అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరాంనగర్ అక్కారంపల్లి రోడ్డు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాబుతో ఒంటరిగా ఉన్న మహిళపై ఇంటి యజమాని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మహిళపై దారుణంగా వికృత చేష్టలు చేయడంతో పాటు ఫోన్లో ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి భయపెట్టాడు.


ఈ ఘటనతో మహిళ తీవ్ర భయాందోళనకు గురైంది. భర్త విదేశాల్లో ఉండటంతో పుట్టింటికి వెళ్లి బంధువుల సహాయంతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇంటి యజమాని శ్రీనివాసులు రెడ్డిపై రేప్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.


ఇవి కూడా చదవండి...

రాజమండ్రిలో మరోసారి బయటపడ్డ పాల కల్తీ

అమరావతిపై జగన్‌కు కక్ష, అసూయ పోలేదు: ఎంపీ అప్పలనాయుడు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 04 , 2026 | 11:24 AM